/rtv/media/media_files/2025/05/14/EuVDkXlapZY2WdRXw8Zy.jpg)
Old Man Car Stunt
Old Man Car Stunt: వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించాడు ఓ తాతయ్య, కారును స్టన్నింగ్ స్టైల్‌లో డ్రీఫ్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. అది కూడా నెమ్మదిగా కాదు, అసలైన ప్రొఫెషనల్ డ్రైవర్లు కూడా ఆశ్చర్యపోయేలా స్పోర్ట్స్ కారును డ్రీఫ్ చేశాడు. ఇక ఈ వీడియో నెట్టింట్లో పోస్ట్ అయ్యిన కాసేపట్లోనే వైరల్ అయ్యింది.
Also Read: బాలయ్య కొత్త ఆయుధం రెడీ.. ఇక దబిడి దిబిడే..!
ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా 'Fast & Furious - Tokyo Drift' సినిమా రేంజ్ లో తాతయ్య అదరకొట్టాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంత పెద్ద వయసులో కూడా కారును స్పీడ్ గా, స్టైల్ గా నడిపిన విధానాన్ని చూసి తాతయ్యకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!
ఫ్రెండ్‌ని పక్కన సీట్లో కూర్చోబెట్టి..
తాతయ్య ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఉన్న మరో వృద్ధుడు కూడా కారులో ముందుని సీట్లో కూర్చొని అదే కాన్ఫిడెన్స్‌తో కనిపించడం నెటిజన్లకు మరింత ఆనందాన్ని కలిగించింది. ఇది కేవలం డ్రైవింగ్ స్కిల్ మాత్రమే కాదు, వారి మధ్య ఉన్న స్నేహ బంధానికి కూడా నిదర్శనమంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాతయ్యకు భారీగా లైక్స్..
ఈ వీడియోను ‘Kishan Singh Chahal’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశాడు. నాలుగు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ క్లిప్ ఇప్పటికే 9వేలకు పైగా లైక్స్‌ను సంపాదించింది. వేలాది మంది ఈ వీడియోను షేర్ చేస్తూ తాతయ్యను సోషల్ మీడియా హీరోగా మార్చేశారు.
Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?