/rtv/media/media_files/2024/10/28/ys0VJ3zQuUWmVzItEpZT.jpg)
King Cobra
King Cobra : ఓ వ్యక్తి నిర్భయంగా పామును ముద్దుపెట్టుకుని దానితో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తున్నంతసేపు గూస్‌బంప్స్ రావడం పక్కా. ఆ వ్యక్తి సాహసం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతని ధైర్యసాహసాలకు కొందరు ముగ్ధులవ్వగా, మరికొంతమంది ప్రాణాలకు ఏమౌతుందోనంటూ కంగారు పడ్డారు.
పాముతో మైక్ ఇలా..
వైరల్ వీడియోలో ది రియల్ టార్జాన్‌గా ప్రసిద్ధి చెందిన మైక్ హోల్‌స్టన్ పెద్ద పాముతో ఆడుకోవడం చూడవచ్చు. అంతేకాకుండా దాన్ని ముద్దుకూడా పెట్టుకున్నాడు. చుట్టూ పచ్చదనంతో కూడిన ప్రాంతంలో పాముతో మైక్ ఇలా వీడియో షూట్ చేశాడు. పాముతో కలిసి నడవడం, అతన్ని పాము వెంబడించడం చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు.
Also Read : 'లక్కీ భాస్కర్' ప్రీరిలీజ్ ఈవెంట్..న్యూలుక్ లో రౌడీ హీరో, ఫొటోలు వైరల్
Man dares to plant kiss on Massive king Cobra’s head after grappling with it. Leaving viewers schocked and divided over the dangerous stunt.#The real tarzann pic.twitter.com/ow75z6ChBD
— Shriya (@bite_pixie) October 28, 2024
పామును చేతిలో పట్టుకుని దాని నుదిటిపై ముద్దుపెట్టుకుంటున్న మైక్‌ని కూడా అది క్యాప్చర్ చేసింది. వీడియో వైరల్‌గా మారింది. 19 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. పాములను ఎంతగా ప్రేమిస్తున్నారో కళ్లలో అర్థమవుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు విష సర్పాలతో ఆడుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.
Also Read : గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అవ్వండి.. ఆ పోస్టులను లైక్ చేసినా వేటే.. సిబ్బందికి పోలీసు శాఖ సంచలన ఆదేశాలు
Also Read : అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసుల ఎదురుదెబ్బ..'పుష్ప2' కు ఊహించని షాక్?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: ఇంట్లో ఏసీ 20 డిగ్రీల కంటే తక్కువ పెడితే ఇక అంతే