/rtv/media/media_files/2025/05/29/cE1iGKOkMselXlK3sD6L.jpg)
lizard in biryani
Dead Lizard in Biryani: బిర్యానీలో బల్లులు, బొద్దింకలు, పురుగులు, ఎలుకలు ప్రత్యక్షమైన ఘటనలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి మరో ఘటన వెలుగు చూసింది. కోయంబత్తూర్ ఆర్‌ఎస్ పురంలోని ఫేమస్ హోటల్ 'కోవై బిర్యానీ హోటల్' బిర్యానీ కూరలో చనిపోయిన బల్లి దర్శనమిచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఓ వ్యాపారవేత్త తన స్నేహితులతో కలిసి 'కోవై బిర్యానీ హోటల్' లో భోజనం చేసేందుకు వచ్చారు. అయితే బిర్యానీ తింటుండగా.. ఓ వింత ఐటం వీరి ప్లేట్ లో కనిపించింది. ఏంటా? అని చూడగా చనిపోయిన బల్లి అని తెలిసింది. చికెన్ ముక్కలతో పాటు బల్లి కూడా చక్కగా మిక్స్ అయిపోయి ఉంది.
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
பிரியாணியில் கிடந்த பல்லியால் பதறிப்போன வாடிக்கையாளர்கள்... கோவை பிரியாணி உணவகத்தில் சாப்பிட வந்து வாந்தி எடுத்த சம்பவம்..#Coimbatore | #Hotal | #Food | #Lizard pic.twitter.com/wxJcIH9gda
— Polimer News (@polimernews) May 28, 2025
Also Read: Kannada language:క్యాబ్ డ్రైవర్ నుంచి కమల్ హాసన్ వరకు.. అసలు కన్నడ 'భాషా' వివాదమేంటి?
చనిపోయిన బల్లి
బల్లిని చూడగానే తీవ్ర దిగ్బ్రాంతికి గురైన అతడు హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన వ్యాపారవేత్త మేనేజర్ తో గొడవకు దిగాడు. విషయం తెలియడంతో హోటల్ లో భోజనం చేస్తున్న వారంతా వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు. చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి పరుగులు తీశారు. ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు హోటల్ ను తనిఖీ చేశారు. అనంతరం తాత్కాలికంగా హోటల్ ని మూసివేసినట్లు సమాచారం.
Also Read: Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!