Frog Pizza: ఫ్రాగ్ పిజ్జా చూశారా.. బాబోయ్ తింటే ప్రాణాలు ఉంటాయా?

పిజ్జా హట్ కంపెనీ చైనాలో గోబ్లిన్ పిజ్జా పేరుతో ఓ ఫ్రాగ్ పిజ్జాను తయారు చేసింది. ఎగ్, కొత్తిమీరతో గార్నిష్ చేసిన ఈ పిజ్జా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చైనాలో దొరికే ఈ ఫ్రాగ్ పిజ్జా ధర 169 యువాన్లు.. ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.2000 అన్నమాట.

New Update
Frog Pizza

పిజ్జా అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. కానీ ఈ పిజ్జా చూస్తే జీవితంలో ఇక దాని జోలికి వెళ్లరు. మిగతా దేశాలతో పోలిస్తే సాధారణంగానే చైనాలో ఆహారపు అలవాట్లు వేరేగా ఉంటాయి. కీటకాలు, కప్పలు. ఈగలు జంతువులు ఇలా అన్నింటిని అక్కడి ప్రజలు తింటారు. అయితే సాధారణంగా చికెన్, మటన్, వెజ్ ఇలా పిజ్జాలు ఉంటాయి. కానీ చైనాలో ఫ్రాగ్ పిజ్జా కొత్తగా మార్కెట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫ్రాగ్ పిజ్జా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం

ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

చైనాకి చెందిన ఓ కంపెనీ..

పిజ్జా హట్ కంపెనీ చైనాలో గోబ్లిన్ పిజ్జా పేరుతో ఈ ఫ్రాగ్ పిజ్జాను తయారు చేసింది. ఈ  పిజ్జాపై బాగా ఫ్రై చేసిన కప్ప, ఉడికించిన గుడ్లు, బ్లాక్ ఆలివ్, కొత్తిమీర అన్ని వేసి తయారు చేశారు. చూడటానికి కలర్ ఫుల్‌గా ఉండే ఈ పిజ్జాను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !

మనుషులు తినడానికి ఈ పిజ్జా చేశారా? లేకపోతే వారిని చంపడానికా? అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిజ్జా తెగ వైరల్ అవుతున్న ఈ ఫ్రాగ్ పిజ్జా ధర 169 యువాన్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.2000 అన్నమాట. మరి ఈ ఫ్రాగ్ పిజ్జాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

ఇది కూడా చూడండి: నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు