/rtv/media/media_files/2025/10/19/world-book-of-records-india-2025-10-19-21-38-00.jpg)
ప్రముఖ చెఫ్ విష్ణు మనోహర్ రికార్డును నెలకొల్పారు. మహారాష్ట్రకు చెందిన ఈ చెఫ్ 25 గంటల పాటు దోశలు తయారు చేసి, 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా'లో చోటు దక్కించుకున్నారు. చెఫ్ విష్ణు మనోహర్ అమరావతిలో శనివారం ఉదయం 7 గంటలకు ఈ 'దోశ మారథాన్'ను ప్రారంభించారు. 25 గంటలపాటు అంటే ఆదివారం ఉదయం వరకు దోశలు వేయడం కొనసాగించారు. ఈ క్రమంలో, ఆయన మొత్తం 15,773 దోశలను తయారు చేశారు. ఈ అద్భుత ఘనతను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా సంస్థల ప్రతినిధులు గుర్తించారు.
గత ఏడాది దీపావళి సందర్భంగా నాగ్‌పుర్‌లో 24 గంటల్లో 14,174 దోశలు తయారు చేసి నెలకొల్పిన ఆయన రికార్డును ఇప్పుడు ఆయనే బ్రేక్ చేశాడు.
#WATCH | Nagpur: Chef Vishnu Manohar has started making dosas non-stop on the occasion of Diwali, with a target of making 10000 dosas in 24 hours. (27.10) pic.twitter.com/NNXmFY5YJ6
— ANI (@ANI) October 28, 2024
ఈ సరికొత్త రికార్డుతో ఆయన పేరు మీద మొత్తం 31 రికార్డులు నమోదయ్యాయి. ఆయన చేతి రుచిని ఆస్వాదించేందుకు అమరావతి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒకేసారి మూడు నుంచి నాలుగు పెనం (తవా)లను ఉపయోగించి, ప్రతి నిమిషానికి దాదాపు 10 నుంచి 12 దోశలు చొప్పున వేస్తూ ఆయన ఈ రికార్డును పూర్తి చేశారు. ఈ సందర్భంగా తయారైన దోశలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. భారతీయ వంటకాల వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతోనే తాను ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నానని చెఫ్ విష్ణు మనోహర్ తెలిపారు. భవిష్యత్తులో పూణే, హైదరాబాద్, కాన్పూర్ వంటి నగరాల్లో ప్రతిసారీ ఒక గంట పెంచుతూ కొత్త రికార్డులు నెలకొల్పుతానని ఆయన ఉత్సాహంగా చెప్పారు.