/rtv/media/media_files/2025/03/12/CGHFHQwLVSHdNOLJe8W1.jpg)
snakes in split ac
Viral Video: ఏసీ నుంచి చల్లని గాలొస్తే బాగానే ఉంటుంది. కానీ కుప్పలు కుప్పలుగా పాములు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకున్నారు? ఏంటి పాములు అనేసరికి షాకయ్యారా! అవును ఇది నిజంగానే జరిగింది. బయట ఎండలు భగ్గుమనడంతో ఇన్నాళ్లు మూలకు పడేసిన ఏసీలును మళ్ళీ వాడడం మొదలు పెట్టారు. ఇలా ఓ ఇంట్లో చాలా రోజుల తర్వాత ఏసీ ఆన్ చేయడంతో దాని నుంచి పాములు వేలాడుతూ కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు కుప్పలు, తెప్పలుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు భయంతో ఏసీ ఆఫ్ చేశారు. ఈ ఘటన విశాఖ పెందుర్తిలో చోటుచేసుకుంది.
చాలా రోజుల తర్వాత ఏసీ వేస్తున్నారా.. అయితే మీ ఏసీలో కూడా ఇలానే పాములు ఉండొచ్చు
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2025
విశాఖ జిల్లా పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పిల్లలు పెట్టిన పాము
సమాచారం అందుకొని ఏసీలో ఉన్న పాము, పిల్లలను బయటికి తీసిన స్నేక్ క్యాచర్
దీంతో అన్ని పాము పిల్లలను చూసి భయందోళనకు… pic.twitter.com/8fa7V9DKvC
ఏసీలో పాములు..
అయితే పెందుర్తి మండలం పొలగానిపాలెం నేతాజీ నగర్ అపార్ట్మెంట్ లోని ఓ ఇంట్లో బెడ్ రూమ్ ఏసీ నుంచి వింత శబ్దాలు రావడం కుటుంబ సభ్యులు గమనించారు. అయినప్పటికీ పట్టించుకోకుండా ఏసీ ఆన్ చేయడంతో.. ఆ స్ప్లిట్ ఏసీ నుంచి పాములు వేలాడుతూ కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఏసీ ఆఫ్ చేసి స్నేక్ కేచర్ ను పిలిపించారు. అనంతరం అక్కడికి వచ్చిన స్నేక్ కేచర్ ఒకటి కాదు రెండు కాదు ఏసీలో నుంచి కుప్పలు కుప్పలుగా పాములను బయటకు తీశాడు. దీంతో కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే చెట్లల్లో నివసించే ఈ పాములను బ్రాంజ్ బ్యాక్ పాములు అంటారని. ఇవి విషపూరితమైనవి కాదని స్నేక్ కేచర్ తెలిపారు. ఏదేమైనా అన్ని పాములు ఏసీలో ఉండడం చూసి కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే చాలా రోజుల పాటు ఏసీ వాడకుండా ఉంచడం లేదా ఏసీలో చేరిన కొన్ని రకాల పురుగులు ఆహారంగా తీసుకునెందుకు పాములు అక్కడ చేరి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చూడండి: Kartik Aaryan: కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి?