Kartik Aaryan: కార్తిక్‌ ఆర్యన్‌, శ్రీలీల డేటింగ్‌.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి?

కార్తీక్ ఆర్యన్ -శ్రీలీల డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్తీక్ ఆర్యన్ తల్లి ఒక మంచి డాక్టర్ తన ఇంటి కోడలిగా రావాలి అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం శ్రీలీల కూడా MBBS చదువుతుండడంతో ఆమె వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

New Update
karthik aryan sreeleela dating hero mother comments viral

karthik aryan sreeleela dating hero mother comments viral

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల డేటింగ్ లో ఉన్నారంటూ గతకొద్ది రోజులుగా బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవలే జరిగిన IIFA అవార్డు వేడుకలో కార్తీక ఆర్యన్ తల్లి తన కాబోయే కోడలు ఎలా ఉండాలో తెలియజేస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. IIFA ఉత్సవాల్లో పాల్గొన్న ఆమెను నిర్మాత కరణ్ జోహార్ కాబోయే కోడలి గురించి ప్రశ్నించగా..  ''ఒక మంచి డాక్టర్ మా ఇంటి కోడలిగా రావాలని  కోరుకుంటున్నాం'' అని తెలిపారు. 

Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్‌ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి

ఆ వ్యాఖ్యలకు అర్థం అదేనా? 

అయితే ప్రస్తుతం శ్రీలీల కూడా ఎంబీబీఎస్ చదువుతుండడంతో ఆమె వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీంతో కార్తిక్ ఆర్యన్- శ్రీలీల డేటింగ్ లో ఉన్నారనే వార్తలు మరింత బలపడ్డాయి.  కార్తీక్ తల్లి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారా అని అనుకుంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ఇటీవలే కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో శ్రీలీల కూడా సందడి చేసింది. ఆ ఫంక్షన్‌లో శ్రీలీల డ్యాన్స్ చేస్తుండగా, కార్తీక్ ఆర్యన్ ఆమెను తన ఫోన్‌లో రికార్డ్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. 

ఇది కూడా చూడండి: రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు!

ఇది ఇలా ఉంటే.. కార్తీక్ ఆర్యన్- శ్రీలీల జంటగా హిందీలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో  శ్రీలీల- కార్తీక్ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. అనురాగ్‌ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ..  ఆషికి 2 సీక్వెల్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీలీల ఈ సినిమాతో హిందీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. 

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు