Sachin Tendulkar: పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం యావత్ భారత్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన ఫొగాట్.. ఈవెంట్‌కు ముందు బరువు కొలవగా కేవలం 100 గ్రాములు అధికంగా ఉండటంతో నిర్వాహకులు ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. బరువు తగ్గేందుకు ఆమె ఎంతగానో ప్రయత్నించినా ఫలితం చేజారిపోయింది.తనకు జరిగిన అన్యాయం మీద కోర్టుకు వెళ్ళింది. అనర్హత వేటు మీద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లో రిపోర్ట్ చేసింది. సెమీస్‌లో గెలిచిన తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలని అందులో కోరింది.
దీనికి క్రికెట్ దిగ్గజం సచిన్ మద్దతు తెలిపారు. వినేశ్‌కు సిల్వర్ మెడల్ ఇవ్వాల్సిందేనని అన్నారు. దీనికి సంబంధించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రతీ ఆటకు నియమ నిబంధనలు ఉంటాయి. కానీ వాటిని ఎప్పటికప్పుడు మార్చుకోవాలని సచిన్ అన్నారు. వినేశ్ తన అద్భుతమైన ఆటతో ఫైనల్‌కు చేరుకుంది. కానీ వంద గ్రాముల బరువు ఎక్కువ ఉందని ఆమెపై వేటు వేశారు. ఇది పెద్ద కారణం కాదు..దీని వలన ఆమెపై వేటు వేయడం క్రీడాస్ఫూర్తి లోపించినట్టే అన్నాడు సచిన్. ఆటగాళ్ళు అనైతికంగా ప్రవర్తించనా..అలాంటి వస్తువులు వినియోగించినా అనర్హులని ప్రకటించాలి కానీ ఇలాంటి వాటి మీద కాదని సచిన్ తన పోస్ట్‌లో రాశాడు. వినేశ్ చాలా బాగా ఆడి ఫైనల్ వరకు చేరుకుంది కాబట్టి ఆమె కచ్చితంగా రజత పతకానికి అర్హురాలేనని చెప్పడు. స్పోర్ట్స్ కోర్టు నిర్ణయం కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. వినేశ్ కి తగిన గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను.’ సచిన్ టెండూల్కర్ ఆమెకు బాసటగా నిలిచారు.