Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగాట్ సెమీఫైనల్స్‌లో గెలిచి.. ఫైనల్స్‌కు ముందు అనర్హతకు గురైంది. దాంతో పాటూ తనకు రావాల్సిన పతకాన్ని కూడా కోల్పోయింది. దీని మీద వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్‌లో పిటిషన్ వేసింది. తనకు రజత పతకాన్ని ఇప్పించాలని కోరింది. అయితే దాన్ని నిన్న కాస్ కొట్టేసింది. వినేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అడ్‌హక్ డివిజన్ సోల్ ఆర్బిట్రేటర్ అనబెల్ బెనెట్ తీర్పునిచ్చారు.
కాస్ తీర్పుతో వినేశ్ తో పాటూ యావత్ భారత దేశం తీవ్ర నిరాశకు గారైంది. మరోవైపు ఈ తీర్పు మీద వినేశ్ కూడా మొట్ట మొదటసారి స్పందించింది. కాస్ తీర్పు ఎంతో వేదనకు గురిచేసిందనే అర్ధం వచ్చేలా మ్యాట్ మీద పడుకుని ఏడుస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీని కింద ఏమీ రాయకపోయినప్పటికీ..కాస్ తీర్పుతో ఆమె గుండె బద్ధలయిపోయిందని తెలుస్తోంది.
వినేశ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఆమె పోస్ట్‌ను రీ షేర్ చేయడమే కాక వందల్లో కింద కామెంట్లు కూడా పెడుతున్నారు. వినేశ్ నువ్వే ఒక డైమండ్..ఒక మాకు వేరే గోల్డ్, సిల్వర్ మెడల్స్ ఎందుకు అని ఒకరు కామెంట్ పెట్టారు. అసలైన ఛాంపియన్ నువ్వే అంటూ మరొకరు..నువ్వు మహిళల రెజ్లింగ్ లో లెజెండ్ అని ఇంకొకరు..ఇలా కామెంట్లు పెడుతూ తమ మద్దతును తెలిజేస్తున్నారు.
Also Read: Andhra Pradesh: చిక్కుల్లో రోజా, ధర్మాన..విచారణకు ప్రభుత్వం ఆదేశాలు