చిన్నమ్మా పురందేశ్వరీ..జాతీయ నేత నుంచి జాతి నేతగా ఎందుకు మారారు? : విజయసాయి రెడ్డి! వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పై మరోసారి విరుచుకుపడ్డారు. జాతీయ నేతగా ఉన్న మీరు జాతి నేతగా ఎందుకు మారారు అంటూ ప్రశ్నించారు. By Bhavana 15 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. పురంధేశ్వరిని రాజకీయంగానే కాదు వ్యక్తిగత విషయాలపైన విజయసాయిరెడ్డి విరుచుకుపడుతున్నారు. ఆమె ప్రత్యక్షంగా బీజేపీలో ఉండి పరోక్షంగా టీడీపీ కోసం పని చేస్తున్నారని ఆయన వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి మరోసారి పురంధేశ్వరి పై మరోసారి రెచ్చిపోయారు. చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరీ! జాతీయ స్థాయి నేతగా ఉండి జాతి నేతగా ఎందుకు మారారు అంటూ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలోని మీ స్వస్థలం కారంచేడులో బీజేపీ సర్పంచులను లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎందుకు పోటీలో నిలపలేదు?. అప్పటికే మీరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా! అంటూ పురందేశ్వరిని విజయసాయి రెడ్డి నిలదీశారు. బీజేపీలోని చిన్న చిన్న నేతలు సైతం తమ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలను బరిలో నిలిపారు...ఇలా పార్టీ కోసం నిబద్దత, నిజాయితీగా వ్యవహరించారని విజయసాయి పేర్కొన్నారు. కానీ జాతీయ నేతగా ఉన్న మీరేందుకు ఆ పని చేయలేదు? నాకు సమాధానం చెప్పకపోయినా కనీసం మీ కార్యకర్తలు అడిగితే ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. కొంపదీసి '' మా బావ కళ్లల్లో ఆనందం కోసం'' అని నిజం చెబుతారా? అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పురందేశ్వరికి బీజేపీ కంటే టీడీపీ ప్రయోజనాలే ఎక్కువని ప్రజలకు అర్థం అవుతుందని విజయసాయి అన్నారు. బీజేపీ పట్ల ఆమెకు ఉన్న చిత్తశుద్ది ఏమిటో గత ఎన్నికలను పరిశీలిస్తే అర్థమవుతుందని అన్నారు.వెనకటికి ఒకామె...ఉట్టికి ఎగరలేదు కానీ స్వర్గానికి ఎగురుతా అందట! అలాగే పురందేశ్వరి తీరు వుందని విజయసాయి రెడ్డి సెటైర్లు వేసారు. గతంలో కారంచేడులో జరిగిన ఓ ఎన్నికలో అన్ని పార్టీలకు వచ్చిన ఓట్ల వివరాలను విజయసాయి రెడ్డి బయటపెట్టారు. ఈ క్రమంలోనే పురందేశ్వరి కుటుంబం ఓట్లు కలిగిన 145 వ పోలింగ్ బూత్ లో బీజేపీకి కేవలం 6 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇందులో అసలు పురందేశ్వరి ఓటు ఉందా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షురాలే ఓటు వేయలేదా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. బావ చంద్రబాబు పక్షపాతి అయిన పురందేశ్వరికి ఏపీ అభివృద్ధి కంటగింపు అయిపోయిందన్నారు. సిద్దాంతాలు గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారని ఆయన ప్రశ్నించార.ఇలా గట్టిగా అడిగితే మా ఓటు అక్కడ లేదు... వైజాగ్ లోనో రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు మళ్ళీ! అంటూ పురందేశ్వరి పై విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. Also read: తిరుపతిలో మళ్లీ చిరుత కలకలం.. భక్తులకు టీటీడీ కీలక సూచన #ycp #bjp #ap #politics #purandeswari #vijayasaireddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి