Crazy Combo : న్యాచురల్ బ్యూటీతో రౌడీ హీరో రొమాన్స్?

రవి కిరణ్ కోలా దర్శకతంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందట. దాంతో ఆ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట .

New Update
Crazy Combo : న్యాచురల్ బ్యూటీతో రౌడీ హీరో రొమాన్స్?

Vijay Devarakonda Romance With Sai Pallavi : ఈ మధ్య మన టాలీవుడ్(Tollywood) లో కొన్ని ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అది హీరో - డైరెక్టర్ కాంబో కావచ్చు, లేదా హీరో - హీరోయిన్ కాంబో కావచ్చు. ఇప్పటివరకు కలిసి నటించని హీరో, హీరోయిన్లు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం జత కడుతున్నారు. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ తాజాగా కుదిరినట్లు తెలుస్తోంది.

రౌడీ హీరోతో న్యాచురల్ బ్యూటీ రొమాన్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గానే తన బర్త్ డే(Birthday) కి కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రెజెంట్ ఈ హీరో చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో రవి కిరణ్ కోలా దర్శకతంలో చేస్తున్న సినిమాలో విజయ్ దేవరకొండ ఓ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్(Romance) చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read : మీడియా సంస్థలపై మండిపడ్డ ‘ఎఫ్2’ హీరోయిన్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ?

ఆమె మరెవరో కాదు మన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) అని సమాచారం. ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందట. దాంతో ఆ పాత్రకు సాయి పల్లవి అయితేనే సూట్ అవుతుందని మేకర్స్ భావించి.. తాజాగా సాయి పల్లవితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సాయి పల్లవి కనుక ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెబితే టాలీవుడ్ లోనే ఓ క్రేజీ కాంబో సెట్ అయినట్లే అని చెప్పొచ్చు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి 'తండేల్' అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు