PCOS మహిళల్లో ఆ సమస్య ఉంటే మరింత ప్రమాదమా!

మహిళల్లో ఒత్తిడి, PCOS రెండింటి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడికి కారణంగా శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరగడం ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితి PCOS లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

pcos

PCOS

New Update

PCOS: ఒత్తిడి అనేది  వ్యక్తిని మానసికంగానే కాకుండా శారీరకంగానూ  బలహీనంగా మార్చే సమస్య.  ఇది అనేక శారీరక సమస్యలను కలిగిస్తుంది. వాటిలో ఒకటి పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS). PCOS సమస్యలో.. మహిళల్లో అండాశయాల పరిమాణం పెరిగి వాటి అంచులలో చిన్న తిత్తులు ఏర్పడతాయి. దీనివల్ల రుతుక్రమం సరిగా జరగకపోవడం, మొటిమలు, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు దీని కారణంగా చాలా మంది స్త్రీలు గర్భం దాల్చడంలో సమస్యలు ఎదుర్కుంటారు. అయితే  పరిశోధనల ప్రకారం మహిళల్లో..  ఒత్తిడి, PCOS మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. PCOS మహిళల్లో దాదాపు 60% మంది మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడుతున్నారు. 

Also Read: వామ్మో ఈ ఆంటీ నక్క తోక తొక్కింది.. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది!

pcos2

PCOS తీవ్రతరం 

నిపుణుల అభిప్రాయం ప్రకారం టెన్షన్స్, ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరగడం ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితి PCOS లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాదు శరీరంలో అధిక కార్టిసాల్ వల్ల .. ఇన్సులిన్ స్రావం కూడా ప్రభావితమవుతుంది. దీని కారణంగా మహిళల్లో ఆండ్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరిగే ప్రమాదం కూడా ఉంది.  దీనిని మగ హార్మోన్ అని కూడా పిలుస్తారు.  PCOS లో అధిక ఒత్తిడితో బాధపడుతున్న మహిళలు గర్భం దాల్చడంలో మరిన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Also Read:  కుక్క కోసం.. బ్రిటన్ రాజునే లెక్కచేయని టాటా! రూ.165 కోట్లతో డాగ్ హాస్పిటల్

PCOS తో బాధపడుతున్న మహిళలు వీలైనంత వరకు ఒత్తిడిని నిర్వహించడానికి ప్రయత్నించాలి. ఏ పరిస్థితులు ఒత్తిడికి దారితీస్తాయో తెలుసుకొని.. వాటికి దూరంగా ఉండండి. జీవనశైలిలో యోగా, ధ్యానం మరియు ప్రాణాయామం వంటి వాటిని అలవాటు చేసుకోండి. 

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల పండగ.. లిస్ట్ ఇదే!

ఇది కూడా చదవండి: మర్డర్ మిస్టరీ.. థ్రిల్లింగ్ గా కృతి, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్

#health-tips #pcos-symptoms
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe