/rtv/media/media_files/WvD99wj10mBoNUjIUFRV.jpg)
viral video
viral video: కొంతమందికి శని వైఫైలా చుట్టూ ఉన్నట్లే .. మరికొంతమందికి అదృష్టం ఉంటుంది. ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తల పై వాటర్ ట్యాంక్ పడినా.. ఒక్క గాయం లేకుండా బయటపడింది ఈ ఆంటీ. అయితే ఒక ఆంటీ హ్యాపీగా యాపిల్ తింటూ వీధిలో సంతోషంగా నడుచుకుంటూ వెళుతుండగా, పై నుంచి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఆమె తల మీద పడింది. కానీ ఇక్కడ ఆశ్చర్యమేంటంటే మీద అంత పెద్ద వాటర్ ట్యాంక్ పడినా.. ఒక్క గాయం కూడా లేకుండా స్పైడర్ మెన్ ల ట్యాంక్ లో నుంచి బయటకు వచ్చింది ఆంటీ. అదేంటంటే ట్యాంక్ బోలుగా (బోర్లా) ఆమె పై పడింది. దీంతో ఎలాంటి గాయాలు కాలేదు. ఇంత జరిగినా.. ఆంటీ మాత్రం యాపిల్ తింటూనే ఉండడం హైలైట్ గా కనిపించింది.
Also Read: ఏంటీ.. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది రతన్ టాటానా!
An apple a day keeps the doctor away. pic.twitter.com/ugvzXYKDxq
— Hemant Batra (@hemantbatra0) October 13, 2024
Also Read: కుక్క కోసం.. బ్రిటన్ రాజునే లెక్కచేయని టాటా! రూ.165 కోట్లతో డాగ్ హాస్పిటల్
లక్షలకు పైగా వ్యూస్
ఇక ఇంటర్ నెట్ లో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆంటీ అదృష్టానికి ఆశ్చర్యపోతున్నారు. నక్క తోక తొక్కింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది.. ఆంటీ యాపిల్ తింటుండగా ఈ ఘటన జరగడంతో ఫన్నీగా.. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉంచుతుంది అని అంటున్నారు. నిజానికి ఆంటీ చాలా అదృష్టవంతురాలే అని చెప్పాలి. లేదంటే తీవ్ర గాయలయ్యేయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు 9 లక్షల 55 వేలకు పైగా వీక్షణలు మరియు ఐదు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. వందలాది మంది వినియోగదారులు స్పందించారు.
Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల పండగ.. లిస్ట్ ఇదే!
ఇది కూడా చదవండి: మర్డర్ మిస్టరీ.. థ్రిల్లింగ్ గా కృతి, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్
Follow Us