Maharastra:పులికి ఉన్న బుద్ధి మనకు లేదయ్యో..చూసి నేర్చుకోండి

తడోబా నేషనల్ పార్క్‌లో ఓ పులి చేసిన పని అందరి చేతా వావ్ అనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంత చెబుతున్నా పట్టించుకోని వారికి ఈ పులి బాగా గడ్డి పెట్టింది. నేషనల్ పార్క్‌లో పులులు నీరు తాగే చెరువులో ఎవరో పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను పులి బయటకు తీసి చెత్తలో వేసింది.

Maharastra:పులికి ఉన్న బుద్ధి మనకు లేదయ్యో..చూసి నేర్చుకోండి
New Update

Tiger Video Goes Viral: ప్లాస్టిక్..ప్లాస్టిక్..భూగోళం అంతా దీంతో నింపేశారు మానవులు. అడవులు, కొండలు, సముద్రాలు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. దీనివల్ల జీవులకు, ప్రకృతికి ముప్పు అని చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అడవి జంతువులు ప్లాస్టిక్‌ను తినడం వల్ల అనారోగ్యం పాల‌వుతున్నాయి. కొన్నిసార్లు చ‌నిపోతున్నాయి కూడా. అయినా, మాన‌వులు ప్లాస్టిక్ వినియోగం మాన‌డం లేదు. వాడిన వాటిని స‌క్రమంగా పార‌వేయ‌డం లేదు. పర్యావరణ సమస్యల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ప్లాస్టిక్ వ్యర్ధాలతో భూమి అంతా నిండిపోతున్నా మనుషులు మారడం లేదు. ఎక్కడపడితే అక్కడ పడేయడమూ మానడం లేదు. కానీ మానవులకు లేని బుద్ధి వన్య ప్రాణులకు కలిగింది. అందుకే తమ నష్టాన్ని తామే పూడ్చుకుంటున్నాయి.

మనుషుల కంటే జంతువులే నయం...

ప్లాస్టిక్ మత్తులో మునిగి తేలుతున్న మనుషులను చాచి పెట్టి కొట్టే పని చేసింది తడోబా నేషనల్ పార్క్‌లోని ఓ పులి. పులులు అంటే మనం కేవలం క్రూర జంతువులుగానే చూస్తాం. కానీ ఈ రోజు ఓ పులి చేసిన పని మనుషులు అందరూ తలదించుకునేలా ఉంది. మనుషులు ప్లాస్టిక్‌ను వాడడమే కాదు ఎక్కడపడితే అక్కడే పడేసి వెళ్ళిపోతుంటారు. కనీసం వాటిని సరైన చోట డిస్పోజ్ కూడా చేయరు. అలాంటి ప్లాస్టిక్ వ్యర్ధాన్ని క్లీస్ చేసిందీ పులి. టడోబా నేషనల్ పార్క్‌లో ఓ చిన్నచెరువులో ఎవరో ప్లాస్టిక్ బాటిల్ పడేసి వెళ్ళిపోయారు. దాన్ని అక్కడ నివాసం ఉంటున్న ఓ పులి నోటితో తీసి దూరంగా విసిరేసింది. తాము తాగే నీటి గుంటలో ప్లాస్టిక్ బాటిల్ కనిపించడంతో ఈ పని చేసింది.

సోషల్ మీడియాలో వైరల్..

పులి చేసిన ఈ పనిని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ కతికర్ వీడియో తీశారు. తరువాత ఆయన దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి ఆయన టైగర్ స్వీట్ గెస్చర్ అని క్యాప్షన్ పెట్టారు. దాంతో పాటూ తాము కూడా అరణ్యాలను శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని రాశారు. వీడియో పెట్టిన వెంటనే వైరల్ అయిపోయింది. ఇస్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ టచేసిన కొద్ది సేపటికే 21 వేల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో కింద చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. పులి చేసిన పనికి ఆనందంగా ఉంది అంటూనే విచారంగా కూడా ఉంది అని అంటున్నారు. తాము సిగ్గుపడేలా పులి ప్రవర్తించిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ గురించి ఇప్పటికైనా అవగాహన పెంచుకోండి అంటూ మరికొందరు అంటున్నారు. అందమైన వీడియో. మన అడవిని ప్రేమిద్దాం.. ప్లాస్టిక్ రహితంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం అని చెబుతున్నారు.

Also Read:ANdhra Pradesh:దేవినేని vs వసంత..మైలవరం టికెట్ ఎవరికి దక్కేనో?

#video #viral #tiger #thadoba-national-park #plastic-bottle
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe