Rahul Gandhi made Orange Marmalade: దేశ రాజకీయాల్లో నిత్యం చురుకుగా ఉంటూ తనదైన పాత్ర పోషిస్తున్న రాహుల్ గాంధీ ..ఒక్కసారిగా వంట గదిలో ప్రత్యక్షమై గరిటె తిప్పితే ఎలా ఉంటుందో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ కథనం చదివేయండి.
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi) కి ఎంతో ఇష్టమైన వంటకాన్ని నూతన సంవత్సర కానుకగా స్వయంగా వండి వడ్డించారు. సోనియాకు ఎంతో ఇష్టమైన '' ఆరెంజ్ మార్మలాండ్'' ని తయారు చేసి తినిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఈ ఆరెంజ్ మార్మలాండ్ కు కావల్సిన ఆరెంజ్ లు స్వయంగా రాహుల్ వాళ్ల ఇంట్లోనే కాశాయి. దీంతో వాటిని తెంపడానికి రాహుల్ తన తల్లి సోనియాతో కలిసి బాస్కెట్ పట్టుకుని వెళ్లారు. ప్రస్తుతం రాహుల్ స్వయంగా తయారు చేసిన ఈ వంటకానికి సంబంధించిన వీడియో ని రాహుల్ ఆయన తన యూట్యూబ్ ఛానెల్ లో అభిమానులతో పంచుకున్నారు.
ముందు వీడియోలో సోనియా రాహుల్ తమ తోటలో పండిన ఆరెంజలను తెంచడానికి వెళ్లారు. ఇద్దరు కలిసి బాగా పండిన కాయలను తెంచి బుట్టలో వేయడం కూడా రాహుల్ చూపించారు. ఈ వంటకాన్ని రాహుల్ తన సిస్టర్ ప్రియాంక వాద్రా (Priyanka Vadra)నుంచి నేర్చుకున్నట్లు ఆయన వీడియోలో వివరించారు.
వంటగదిలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో సోనియా తనకు భారతీయ వంటకాలు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టిందని..మొదట్లో కారం తినడానికి చాలా సమయం పట్టిందని సోనియా గాంధీ వివరించారు. ఆ తరువాత రాహుల్ ఈ ఆరెంజ్ మర్మాలాండ్ ని '' బీజేపీ వాళ్లు ఈ జామ్ అడిగితే వాళ్లకి ఇద్దామా మమ్మీ? '' అని అడిగితే..దానికి సోనియా '' వాళ్లు మన మీద విసురుతారు'' అనగానే ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు.
తయారు చేస్తున్నంత సేపు కూడా రాహుల్ తన తల్లితో చాలా జాలీగా కనిపించారు. వంటకం పూర్తి అయిన తరువాత దానిని గాజు సీసాల్లో నింపారు. '' ప్రేమతో సోనియా, రాహుల్ '' అని బ్రౌన్ పేపర్ మీద రాసిన సందేశాన్ని ఆ సీసాలకు అతికించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
దీనిని చూసిన రాహుల్ అభిమానులు వారు చాలా సింపుల్ గా ఉండటాన్ని గురించి పొగుడుతున్నారు. తల్లీకొడుకులు ఇద్దరు కూడా చాలా సింపుల్ గా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.
Also read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. ఈరోజున సూర్యుడికి దగ్గరగా వెళ్లనున్న ఆదిత్య L1 ..!!