ఇకనుంచి వాతావరణ సమాచారం మీ చేతిలోనే.. యాప్ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి.. భారత వాతావరణ శాఖ (IMD) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాతావరణ సమాచారాన్ని అందించేందుకు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కొత్త యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజూ వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు. By B Aravind 17 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి భారత వాతావరణ శాఖ (IMD) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాతావరణ సమాచారాన్ని అందించేందుకు 'మౌసమ్' అనే కొత్త యాప్‌ను రూపొందించారు. 'హర్‌హర్ మౌసం.. హర్‌ఘర్ మౌసం' ( ప్రతి ఒక్కరికి.. ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం) అనే పేరట ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. సోమవారం ఢిల్లీలో దీన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ విడుదల చేశారు. అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో కూడా ఈ యాప్‌ను ఉన్నతాధికారులు విడుదల చేశారు. Also Read: విజయవాడలో జనవరి 19న ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణ అయితే ఈ యాప్ సేవలు త్వరలోనే అందరికీ అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో ప్రతిరోజూ వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు. అంతేకాదు రాబోయే అయిదు రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలను తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మరో 11 ప్రాంతీయ భాషల్లో వాతవరణానికి సంబంధించి సమాచారం అందుబాటులో ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. భారీ వర్షాలు, తుపాన్లుకు సంబంధించిన వివరాలు కూడా ఈ యాప్ ద్వారా ముందుగా తెలుకోవడం వల్ల.. విత్తనాలు, నీటిపారుదల, ఎరువులు వంటివి కార్యకలాపాలకు ప్రణాళికలు చేసుకోవచ్చని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని అంటున్నారు. ఇంతకుముందు వాతావరణం గురించి తెలుసుకోవాలంటే పేపర్లు, టీవీలు, వెబ్‌సైట్లో వచ్చే వార్తలపై ఆధారపడేవారు. అయితే ఇప్పుడు ఈ యాప్‌తోనే సులభంగా రోజురోజుకు వాతావరణ పరిస్థితులు తెలుసుకోవచ్చు. వాతావరణాన్ని బట్టి బయటకు వెళ్లాల వద్దా.. ఇంకా ఏవైన పనులు చేసుకోవాలా, వద్ద అనే ప్లాన్స్ ముందుగానే చేసుకోవచ్చు. Also Read: అయోధ్య రామ మందిర వేడుక పై గాయని చిత్ర సోషల్ మీడియా పోస్ట్.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గాయని! #telugu-news #national-news #weather-news #imd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి