KCR: మాజీ సీఎం కేసీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు

TG: ఈరోజు సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసి మాజీ సీఎం కేసీఆర్‌పై వీహెచ్‌పీ నేతలు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

KCR: కేసీఆర్ మరోసారి షాక్ తప్పదా?
New Update

BRS Chief KCR: బస్సు యాత్రతో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ..బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సహం నింపుతున్న మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ తగిలింది. ఈరోజు సీఈఓ వికాస్ రాజ్ ను కలిసి కేసీఆర్‌పై వీహెచ్‌పీ (విశ్వహిందూ పరిషత్) నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారాల్లో హిందువుల మనోభావాలను దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఆయన పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరినట్లు చెప్పారు. కాగా హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వీహెచ్‌పీ నేతలు హెచ్చరించారు.

ALSO READ: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు

కేసీఆర్ కు ఈసీ నోటీసులు...

ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు. కాగా.. సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు పంపింది. గత సారి కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

దీంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. కేసీఆర్, కేటీఆర్‌కు కూడా గతంలో నోటీసులు జారీ చేసింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలతో అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వెళుతుండడంతో ఈసీ సీరియస్‌ అయింది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

#vhp #2024-lok-sabha-elections #kcr #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe