KCR: మాజీ సీఎం కేసీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు
TG: ఈరోజు సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసి మాజీ సీఎం కేసీఆర్‌పై వీహెచ్‌పీ నేతలు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
Ayodya Rammandir: రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ కూడా వస్తారు.. వీహెచ్‌పీ సంచలన ప్రకటన..
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి బీజేపీ సీనియర్ నేత, ఎల్కే అద్వానీ కూడా హాజరవుతారని విశ్వహిందూ పరిషత్ (VHP) ప్రకటించింది. మరో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమానికి హాజరవుతారో లేదో ఇంకా స్పష్టత లేదని తెలిపింది.
US : ఖండాంతరాలను దాటి ప్రతిధ్వనిస్తోన్న జై శ్రీరాం నినాదం.. ప్రాణ ప్రతిష్టకు ముందు హ్యుస్టన్ లో భారీ ర్యాలీ..!!
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముందే జైశ్రీరాం నినాదం ఏడు సముద్రాలను దాటింది. అమెరికాలోనూ జైశ్రీరామ్ నినాదాలు మిన్నంటుతున్నాయి. హ్యుస్టన్ నగరంలో వందలాది మంది జైశ్రీరామ్ నినాదాలతో భారీ ర్యాలీ చేపట్టారు. 216 కార్లతో ర్యాలీ నిర్వహించారు.
Gulam Nabi Azad: మెజార్టీ ముస్లింలు హిందుత్వం నుంచి మారిన వారే... గులాం నబీ ఆజాద్ సెన్సేషనల్ కామెంట్స్...!
కశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ(డీపీఏపీ) చీఫ్ గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలోని మెజార్టీ ముస్లింలు గతంలో హిందువులేనని అన్నారు. ముస్లింలలో అత్యధికులు హిందూ మతం నుంచి మారి వచ్చేనన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ స్వాగతిస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.