Saindhav OTT Release: ఓటీటీలో వెంకటేష్ "సైంధవ్‌" సందడి.. స్ట్రీమింగ్ డేట్ ఆ రోజే ..?

విక్టరీ వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన సినిమా సైంధవ్‌. జనవరి 13 న థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది. సైంధవ్‌ OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Saindhav OTT Release:  ఓటీటీలో వెంకటేష్ "సైంధవ్‌" సందడి.. స్ట్రీమింగ్ డేట్ ఆ రోజే ..?
New Update

Saindhav OTT Release:  స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) అంటే ఫ్యామిలీ డ్రామాలకు పెట్టింది పేరు. అలా అని యాక్షన్ సినిమాలు ఆయనకు కొత్తేమీ కాదు. అయితే ఇటీవలే ఈ రెండింటీ కాంబినేషన్ లో వెంకటేష్ నటించిన లేటెస్ట్ చిత్రం సైంధవ్‌. డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకీ మామ 75 వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రీలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో రీచ్ అవ్వలేకపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.

సైంధవ్‌ ఓటీటీ రిలీజ్

వెంకటేష్ 75 వ చిత్రంగా భారీ ఊహాగానాలతో విడుదలైన సైంధవ్‌.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) దక్కించుకున్నట్లు సమాచారం. వచ్చే నెల ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

సైంధవ్‌ స్టోరీ

తండ్రి, కూతుళ్ళ సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా రూపొందింది. అరుదైన నరాల వ్యాధితో బాధపడుతున్న కూతురిని.. బ్రతికించుకోవడానికి తండ్రి చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. కూతురి వ్యాధి నయం చేయడానికి 17 కోట్ల ఇంజక్షన్ సాధించే క్రమంలో వెంకటేష్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనేది సినిమాలో చూపించారు.

Also Read: Mega Heroes: ఆ మూడు నెలలు మెగా ఫ్యాన్స్ కు పండగే.. వరుసగా మెగా సినిమాల సందడి

Saindhav OTT Release

ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయిన్ పల్లి నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా.. బేబీ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య,రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రల్లో నటించారు. బేబీ సారా, వెంకటేష్ మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ సినిమాలో హైలెట్ గా కనిపించాయి.

Also Read:   హనుమాన్‌ సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌ వైరల్‌

#sailesh-kolanu #venkatesh-daggubati #saindhav-ott-release #saindhav-movie #amazon-prime
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe