Ayodhya Ram Mandir : అయోధ్యలో శాఖాహార సెవన్-స్టార్ హోటల్..ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే..

అయోధ్య రామలయం ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతుంటే ఆలయానికి సమీపంలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో ఒక శాఖహార సెవెన్ స్టార్ హోటల్ కూడా ఉంది.

New Update
Ayodhya Ram Mandir : అయోధ్యలో శాఖాహార సెవన్-స్టార్ హోటల్..ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే..

రామమందిర ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతుంటే అయోధ్యలో అనేక అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. రానున్న కాలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతుంది.

అందులో భాగంగా  ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి శాఖాహార సెవన్-స్టార్ హోటల్ అయోధ్యలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అయోధ్యలో మొత్తం 25 కొత్త హోటల్స్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో ఒకటి పూర్తిగా శాఖాహార హోటల్ ఉందని  తెలిపారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోందని వెల్లడించారు.

జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. బాల రాముడి విగ్రహ ప్రతిష్టకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రానుండగా దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ఏడువేల మంది అతిథులను రామజన్మభూమి ట్రస్ట్ ఇప్పటికే ఆహ్వానించింది. వారిలో సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటు  లక్షలాది మంది స్వామిజీలు, సాధువులు, సాధారణ ప్రజలు హాజరు కానున్నారు. అందుకు తగ్గట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఆలయ ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యకు వచ్చే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు యోగి తెలిపారు. ఇప్పటికే అయోధ్యలో ఆధునిక విమానశ్రయం, రైల్వే స్టేషన్లను నిర్మించగా, అయోధ్య నుంచి వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్‌లను కలుపుతూ.. గ్రీన్ కారిడార్ నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉంది.

అయోధ్య ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఆలయానికి సమీపంలోని హోటళ్లు, ఇండ్లకు డిమాండ్ బాగా పెరిగింది.  మొట్టమొదటి వెజ్ సెవన్ స్టార్ హోటల్‌ను ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. సాధారణ హోటల్స్ తో పాటు ఫైవ్, సెవెన్ స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయడానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. సరయునది ఒడ్డున వీటిని నిర్మించేందుకు ఇప్పటికే భూమి కోనుగోళ్లు ఊపందుకున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు