ANdhra Pradesh:దేవినేని vs వసంత..మైలవరం టికెట్ ఎవరికి దక్కేనో?

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈమన మరో రెండు రోజుల్లో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీంతో మైలవరం నుంచి టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమకు, వసంత కృష్ణకు మధ్య పోటీ నెలకొంది.

New Update
ANdhra Pradesh:దేవినేని vs వసంత..మైలవరం టికెట్ ఎవరికి దక్కేనో?

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో టీడీపీలో చేరేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీడీపీ నుంచి కూడా వసంత కృష్ణప్రసాద్ మైలవరం టికెట్‌నే అడుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దీనికి ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో మైల‌వ‌రం టిక్కెట్ రేసులో వ‌సంత‌, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావులు ఉన్నారు. అయితే వసంత కృష్ణకు మైలవరంతో పాటూ పెనమలూరు టికెట్‌ను కూడా టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీ విషయం మీద అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో మైలవరం క్యాడర్‌లో గందరగోళం ఏర్పడింది.

దేవినేని ఉమ vs వసంత కృష్ణ

టీడీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్ ఎంట్రీతో మైలవరం క్యాడర్ ఫుల్ గందరగోళంలో ఉంది. ఇక్కడి నుంచి టీడీపీ నేత దేవినేని ఉమ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇప్పుడు వసంత రావడం మీద దేవినేని భగ్గుమంటున్నారని సమాచారం. దాంతో పాటూ వసంత కృష్ణప్రసాద్‌పై దేవినేని ఉమా పరోక్షంగా విమర్శలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని... మైలవరం టికెట్ తనకే దక్కాలని ఉమా అంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలుగు దేశం పార్టీ తరుపున మైలవరం నుంచి పోటీ చేసేందుకు దేవినేని ఉమామహేశ్వరరావు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేడర్‌కు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెడుతున్నారు. ఎల్లుండి అన్నారావుపేట నుంచి ఎన్నిక‌ల ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఎట్టిపరిస్థితిలోనైనా మైలవరం సీటు వదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు దేవినేని ఉమ. ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణ ప్రసాద్‌ పరిస్థితి ఏంటి? చంద్రబాబు ఎవరివైపు మొగ్గు చూపుతారనేది చూడాలి.

Also Read:Telangana:మేడారం జాతరకోసం పోలీసుల ప్రత్యేక మొబైల్ యాప్

Advertisment
Advertisment
తాజా కథనాలు