వరుణ్-లావణ్యలకు విడాకులేనా.. మరో చిచ్చుపెట్టిన వేణుస్వామి

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాల్లో దోషాలున్నాయి. వారి జాతకాల్లో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు.

వరుణ్-లావణ్యలకు విడాకులేనా.. మరో చిచ్చుపెట్టిన వేణుస్వామి
New Update

Venu Swamy Shocking Comments On Varun & Lavanya : ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి Venu Swamy పేరు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా మారిపోయింది. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి ఆయన చెప్పిన కొన్ని జాతకాలు ఎంత వరకూ నిజం అయ్యాయో తెలియదు. కానీ అనతికాలంలోనే వేణుస్వామి సోషల్ మీడియాలో ఒక స్టార్ గా ఎదిగిపోయారు. నాగచైతన్య, సమంత పెళ్లి, విడాకుల ఇష్యూతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఆయన మరోసారి సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు.

ఈ మేరకు ఇటీవలే తెలంగాణ ఎలక్షన్స్ విషయంలో తలదూర్చిన వేణుస్వామి.. కేసీఆర్ మూడోసారి సీఎం కాబోతున్నారని బలంగా వాదించి బొక్కబోర్ల పడ్డారు. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే జ్యోతిష్యం చెప్పడం మానేస్తానని మాటిచ్చి అబాసుపాలయ్యారు. అయితే ఈ ఇష్యూ ఇలావుంటే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. మరో టాలీవుడ్ జంటపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), కథానాయిక లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి చేసుకుని పట్టుమని మూడు నెలలు కూడా గడవకముందే వాళ్ల సంసారంలో చిచ్చు పెట్టారు. ప్రస్తుతం హనీమూన్ టూర్ లో వున్న ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం లేదంటూ అభిమానులను ఆందోళనకు గురిచేశారు.

Also read :మరో వివాదంలో త్రిష.. ఇదేం పద్దతంటూ తిట్టిపోస్తున్న జనం

వేణుస్వామి మాట్లాడుతూ.. 'వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి (Varun & Lavanya) జాతకాల్లో దోషాలు ఉన్నాయి. వారి జాతకాల్లో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ భవిష్యత్తులో కలిసుండే అవకాశాలు లేవు. లావణ్య త్రిపాఠికి కుజ దోషం ఉంది. వరుణ్ తేజ్ కు నాగ దోషం ఉంది. ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైన స్త్రీ మూలంగా విడిపోయే అవకాశం ఉంది' అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమవగా.. మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేణుస్వామి ఇంటర్వ్యూలో రెండు విధాలుగా మాట్లాడారని, మొదట లావణ్యకు కుజ దోషం ఉందని చెప్పి.. ఆ తర్వాత లావణ జాతకంలో కుజ దోషంతో పాటు నాగ దోషం కూడా ఉందన్నారు. కాబట్టి ఆయన మాటలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు.

అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతారని గతంలో చెప్పిన మాటలు వాస్తవం అయ్యాయనే బలంతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విషయంలోనూ తాను చెప్పింది నిజం అవుతుందనే భ్రమలో ఉన్నారని ట్రోలింగ్ చేస్తున్నారు. కేసీఆర్ సీఎం విషయంలో దారుణంగా విఫలమైన వేణుస్వామి ఒత్తిడిలో ఉన్నాడని, తన పని అయిపోయిందనే విషయం తెలిసి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడంటున్నారు. అంతేకాదు మరికొందరు మాత్రం 'వాడు ఎక్కడున్నాడో దొరకపట్టుండ్రి', 'ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదు' అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు.

#tollywood #varun-tej #astrology #venuswamy #lavanya-tripathi #shocking-comments
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe