Vangaveeti: నాదెండ్ల మనోహర్‌తో వంగవీటి రాధా భేటీ సోమవారం తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాధా నాదెండ్లను కలిశారు. ఇద్దరు ముందు నుంచి మంచి మిత్రులు కావడంతో సాధారణ విషయాలతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల క్రమంలో ప్రధానంగా వారిద్దరి మధ్య ఆ చర్చ నడిచినట్లు తెలుస్తుంది. By Bhavana 19 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి అప్పుడే ఏపీలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. పార్టీలన్ని కూడా ఇప్పటి నుంచే తమ ప్రణాళికలు రచిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలంతా కలిసి కూటమిగా ఏర్పడి తమ అభ్యర్థులే గెలవాలనే లక్ష్యంతో ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాధా నాదెండ్లను కలిశారు. ఇద్దరు ముందు నుంచి మంచి మిత్రులు కావడంతో సాధారణ విషయాలతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల క్రమంలో ప్రధానంగా వారిద్దరి మధ్య ఆ చర్చ నడిచినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో రాధా ప్రచారం నిర్వహిస్తే ఓట్లు ఎక్కువగా పడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కాపు నాయకులు వైసీపీలో చేరడంతో వారిని ఎదుర్కొనేందుకు రాధా వంటి వారి సేవలు జనసేనకు అవసరమని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. తాము మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశామని చెబుతున్నారు.అయితే అటు నాదెండ్ల కానీ, రాధా కానీ వారి కలయిక గురించి మాత్రం వివరించలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే చర్చించామంటున్న వంగవీటి. ఇంతకు ముందు వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసిన వంగవీటి..వల్లభనేని వంశీ, కొడాలినానితో సంప్రదింపులు కూడా జరిపారు. టీడీపీ రెండు జాబితాల్లోనూ రాధాకు దక్కని సీటు దీంతో అయోమయంలో పడ్డ రాధా పరిస్థితి. తాజాగా నాదెండ్లతో భేటీతో జనసేనలో చేరుతారనే చర్చ నడుస్తుంది. విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన వంగవీటి రాధా..కానీ సెంట్రల్ సీటును బోండా ఉమాకి కేటాయించిన టీడీపీ. 2019లోనూ పోటీకి దూరంగా ఉన్న వంగవీటి రాధా..అప్పట్లో టీడీపీకి ప్రచారం మాత్రమే చేసినా రాధా. Also read: విమానంలో ప్రయాణికుడు ఆత్మహత్యయత్నం..ఎమర్జెన్సీ ల్యాండింగ్! #ycp #tdp #bjp #janasena #radha #nadendla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి