Uttarakhand Tunnel Collapse: సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులు సేఫ్.. అధికారుల కీలక ప్రకటన..

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగమార్గం కూలడంతో అందులో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. సొరంగలో నీటి సరఫరా కోసం వేసిన పైప్‌లైన్ల ద్వారా వారికి ఆక్సిజన్, ఆహార పదార్థాలు అందిస్తున్నామని చెప్పారు.

New Update
Uttarakhand Tunnel Collapse: సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులు సేఫ్.. అధికారుల కీలక ప్రకటన..

Uttarakhand Tunnel Collapse: నిన్న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఘటనస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులదంరూ సురక్షితంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తాజాగా వెల్లడించారు. బాధితులతో తాము మాట్లాడుతున్నట్లు చెప్పారు. సొరంగంలోని నీటి సరఫరా కోసం వేసిన పైప్‌లైన్‌ నుంచి ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. అలాగే అదే పైపు ద్వారా తాగునీరు, ఆహార పదార్థాలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: బాధలు పడుతున్నా..బుద్ధిరాలేదు, ఢిల్లీలో పేలిన టపాసులు

ఇదిలా ఉండగా.. బ్రహ్మఖల్‌-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుంచి దండల్‌గావ్‌ వరకు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. పనులు కొనసాగుతున్న తరుణంలోనే శనివారం రాత్రి టన్నెల్‌ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అందులో పనిచేస్తున్న కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. శిథిలాలు పూర్తిగా కప్పేయడంతో వాళ్లు బయటకు వచ్చేందుకు మార్గం మూసుకుపోయింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయేందుకు సుమారు రెండు నుంచి మూడు రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. టన్నెల్‌ ఆరంభం నుంచి 200 మీటర్ల దూరంలో కూలిపోయిందని.. ఈ ఘటనలో ఇప్పటిదాకా ఎవరూ గాయపడలేదని, వీలైన త్వరలో చిక్కుకుపోయిన కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొస్తామని అంటున్నారు.

Also Read: ధాబాలో దారుణం.. దీపావళికి బోనస్‌ ఇవ్వలేదని యజమానిని ఏం చేశారంటే?

Advertisment
తాజా కథనాలు