Uttarakhand Assebly: రాముడ్ని నల్లగా చేశారు...రెచ్చిపోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!

మేము ఆలయస్వాగతిస్తున్నాం. కానీ నాకు అర్థం కాలేదు, మా రాముడు 'సాన్వ్లా' అని పుస్తకాలలో చదివాము -- అంటే సంధ్యాకాలం -- కానీ బీజేపీ వాళ్లు రామున్ని 'కాలా' (నలుపు)," చేశారు అంటూ ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సభలో పెద్ద దుమారాన్ని రేపారు.

New Update
Uttarakhand Assebly: రాముడ్ని నల్లగా చేశారు...రెచ్చిపోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!

Uttarakhand  Assembly: బుధవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో(Assembly) యూనిఫాం సివిల్ కోడ్ (UCC)బిల్లుపై చర్చ... అయోధ్య రామాలయంలోని రామ్ లల్లా విగ్రహం రంగుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్న మాటలతో పక్కదారి పట్టింది. మంత్రి చేసిన వ్యాఖ్యలు వల్ల సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జస్పూర్‌ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదేశ్ సింగ్ చౌహాన్ అయోధ్య రామాలయం గురించి ప్రస్తావించారు.

ఆ సమయంలో ''మేము ఆలయస్వాగతిస్తున్నాం. కానీ నాకు అర్థం కాలేదు, మా రాముడు 'సాన్వ్లా' అని పుస్తకాలలో చదివాము -- అంటే సంధ్యాకాలం -- కానీ బీజేపీ వాళ్లు రామున్ని 'కాలా' (నలుపు)," చేశారు అంటూ పేర్కొన్నారు. ఈ మాటలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీజేపీ మంత్రులు, శాసనసభ్యులు నిరసనకు దిగడంతో ఈ వ్యాఖ్య పెద్ద దుమారాన్ని రేపింది.

రాముడిపై ఈ వ్యాఖ్య ఎలా చేస్తారని చౌహాన్‌పై ఆర్థిక, పార్లమెంటరీ శాఖ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు

మంత్రి కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘రాముడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఓట్ల కోసం మీరు ఏమైనా చేస్తారు కానీ అలాంటి మాటలు మాట్లాడవద్దని అభ్యర్థిస్తున్నాను. కాంగ్రెస్ కేవలం బుజ్జగింపులు, ఓటుబ్యాంకు రాజకీయాలు చేయడం లేదని చౌహన్‌ తెలపాలంటూ మంత్రి అన్నారు.

జనవరి 22న జరిగిన మహా సంప్రోక్షణ కార్యక్రమంలో అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్ నల్లరాతితో చెక్కారు.విగ్రహం చెక్కిన రాయి కర్ణాటక నుండి తెచ్చిన ప్రత్యేక బ్లాక్ గ్రానైట్. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ డైరెక్టర్ హెచ్‌ఎస్ వెంకటేష్ మాట్లాడుతూ ఈ రాయి 2.5 బిలియన్ సంవత్సరాల నాటిదని చెప్పారు.

ఈ విగ్రహం ఐదేళ్ల రాముడిని సూచిస్తుంది. ఈ ఆలయంలో మొదటి అంతస్థులో సీత, లక్ష్మణుడు, హనుమంతునితో కూడిన రాముడి విగ్రహాలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి.

Also read: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..రెండునెలల్లో ఐదో ఘటన!

Advertisment
తాజా కథనాలు