Movies:నెలరోజుల్లోనే రన్ ముగిసిందా..అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిందీ! డార్లింగ్ ప్రబాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ ఓ రేంజ్‌లో హిట్ అయింది. నెల రోజుల పాటూ సలార్ మేనియాతో ఊగిపోయారు సినీ ప్రియులు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేయడం మీద అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. By Manogna alamuru 19 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి డార్లింగ్‌కు సాలిడ్ హిట్.. బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్‌కు ఓ సాలిడ్ హిట్ పడింది సలార్‌తో. యాక్షన్ మూవీస్‌లో తనకు తిరుగులేదు అని మరోసారి అనిపించుకున్నాడు ప్రభాస్. అలాగే స్క్రీన్ ప్లే, టేకింగ్‌లో తనను ఎవరూ బీట్ చేయలేరు అని మరోసారి రుజువు చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ముందు నుంచి క్రేజీ వైబ్స్‌తో ఉన్న సలార్ మూవీ విడుదల తర్వాత కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. రెండు నెలలు పాటూ సలార్ ఫీవర్‌లో ఉండిపోయారు సినీ ప్రియులు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను క్రియేట్ చేసింది. రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో సలార్ మూవీ స్ట్రీమింగ్ అవనుంది. Also Read:యువతకు మీరు ఆదర్శం..తెలంగాణ రైతుకు ప్రధాని మోడీ ప్రశంసలు రేపటి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్... క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల అయిన సలార్ మూవీ భారీ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల మార్క్‌ను దాటి రికార్డులను సృష్టించింది. దీంతో ప్రభాస్ ఖాతాలో మరో భారీ హిట్ పడింది. బాహుబలి తర్వాత సినిమాలు హిట్ అవ్వక సతమతమవుతున్న ప్రభాస్‌కు ఊరటనిచ్చింది సలార్. ఇప్పటికే థియేటర్లలో రెండు, మూడు సార్లు చూసి పండగ చేసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ అనౌన్స్‌మెంట్‌తో ఫుల్ ఖుషీ అయిపోయారు. మరోసారి ఓటీటీలో దీన్ని చూసేందుకు రెడీ అయిపోతున్నారు. సలార్ మూవీ నెట్‌ఫిక్స్‌లో జనవరి 20 అంటే రేపటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నిజానికి ఈ మూవీ రిపబ్లిక్ డే నాడు రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ నెట్‌ఫ్లిక్స్ ఎవరూ అందరికీ షాక్ ఇస్తూ రేపే విడుదల అంటూ సర్‌ఫ్రైజ్ చేసింది. రెడీ అవుతున్న రెండో పార్ట్... ఖాన్సార్ అనే ఒక సెపరేట్ రాజ్యం...అందులో గొడవలు ఆధారంగా తీసిన సలార్ మూవీ ఫుట్ టూ యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రశాంత్ నీల్ టేకింగ్, ప్రభాస్ మాస్ యాక్షన్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్ళాయి. ఇందులో డార్లింగ్‌తో పాటూ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ రోల్ పోషించారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా చేయగా ఈశ్వరిరావు, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా రెండో పార్ట్ కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. దీని షూటింగ్ ఇప్పటికే దాదాపు 50 శాతం పూర్తి చేసుకుందని మేకర్స్ చెబుతున్నారు. అప్పుడే వచ్చేస్తోందేమిటీ? ఆహా అన్నారు ఓహో అన్నారు...రికార్డ్‌లు బద్దలు కొట్టాయి అని చెప్పారు. డంకీ కు డంకీ తినిపించింది, యానిమల్‌ని వెనక్కి తోసేసింది అన్నారు కానీ ఇప్పుడు ఆరెండు సినిమాల కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసింది సలార్. మరి అంత హిట్ కొట్టిన సినిమా ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు ఓటీటీల్లోకి వచ్చేస్తోందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఈ వార్త సంతోషాన్నిస్తున్నా...ఇంత తొందరగా ఓటీటీల్లోకి వచ్చేడం మీద కాస్త అసంతృప్తిగానే ఉన్నారని సమాచారం. #salaar #prabhas #movies #netflix #streaming #prasnth-neel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి