H-1B Visa:మార్చి 6 నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తులు..ఆన్‌లైన్ ఫైలింగ్ మీద కీలక అప్‌డేట్

హెచ్-1 బీ వీసా రెన్యువల్ కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. దాంతో పాటూ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ హెచ్ -1బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులను కూడా చేసింది. కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెబుతోంది.

New Update
USA Tourist Visa:యూఎస్ పర్యాటక వీసాదారులకు గుడ్‌న్యూస్..డ్రాప్ బాక్స్ సదుపాయం

H-1 B Visa:మార్చి 6 నుంచి వచ్చే ఏడాదికి సంబంధించి హెచ్-1బీ వీసా ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది అమెరికా. ఇది మార్చి 21వరకు కొనసాగనుంది. దీనినే వీసా ఇన్షియల్ రిజిస్ట్రేషన్ పిరియడ్ అంటారు. ఈ వ్యవధిలో కంపెనీలు హెచ్-1బీ వీసా స్పాన్సర్ చేయాలనుకునే తమ ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కొత్త వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియలను బలోపేతం చేస్తూ, మోసాలను తగ్గించేలా కొత్త నియమనిబంధనలను అమలు చేస్తోంది అమెరికా. దీని ప్రకారం వీసా దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పుడు ధృవీకరణ పత్రాలు లేదంటే చెల్లని డాక్యుమెంట్లను జత చేస్తే హెచ్-1బీ దరఖాస్తులను తిరస్కరించడం లేదా రద్దు చేస్తామని యూఎస్‌సీఐఎస్ అధికారులు చెబుతున్నారు.

Also read:Telangana : గ్రూప్-1 పోస్టులకు తెలంగాణ సర్కార్ కసరత్తు… త్వరలోనే నోటిఫికేషన్!

అలాగే దాంతో పాటూ మోసాలను తగ్గించేందుకు ఆర్గనైజేషనల్ అకౌంట్స్ విధానాన్ని కూడా ప్రారంభించనున్నారు. దీంతో కంపెనీ లేదా వ్యాపార సంస్థలోని ఉద్యోగులకు హెచ్-1బీ వీసా అప్లికేషన్‌ను రూపొందించే ప్రక్రియలో ఆయా వ్యాపార సంస్థులు, లీగల్ అడ్వైజరీ ఈ అకౌంట్స్ ద్వారా సమన్వయం చేసుకోవచ్చును. ఈ అకౌంట్ ద్వారా నాన్ ఇమ్మిగ్రంట్ వర్కర్ కోసం సమర్పించే ఫామ్ ఐ 129, ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీస్ కు అవకాశం కల్పించే ఫామ్ ఐ 907 లను సులభంగా అప్లై చేసుకోవచ్చును. ఇక ఐ-129, హెచ్-1బీ పిటిషన్ ఆన్‌లైన్ ఫైలింగ్ ప్రారంభించిన తర్వాత మొత్తం హెచ్-1బీ అప్లికేషన్ విధానం పూర్తిగా ఎలక్ట్రానిక్ అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ నుంచి అప్లికేషన్ మీద తీసుకునే చివరి నిర్ణయం విదేశాంగ శాఖకు తెలియజేసే వరకు అంతా ఆన్‌లైన్‌ అవుతుందని యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు.

ప్రతీ ఏటా అమెరికా 65వేల హెచ్-1 బీ వీసాలను మాత్రమే జారీ చేస్తుంది. దీంతో పాటూ అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన 20వేల మంది విదేశీ విద్యార్ధులకు వీసాలను గ్రాంట్ చేస్తుంది. ఇక ఈఏడాది కూడా 2025 ఆర్ధిక సంవత్సరానికి కూడా 65వేల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తామని యూఎస్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. హెచ్-1బీ వీసాల దరఖాస్తుల స్వీకరణ గత ఏడాది అక్టోబర్ 1 నుంచి చేపట్టి ఈ ఏడాది సెప్టెంబర్ ౩౦న ముగుస్తుంది.

Advertisment
తాజా కథనాలు