ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. సోలార్ ప్రాజెక్ట్ విషయంలో భారీ లంచం ఇచ్చినట్లు ఆరోపణల నేపథ్యంలో అదానీపై కేసు నమోదైంది. అదానీతో పాటు తన మేనల్లుడు సాగర్, మరో ఏడుగురిపై కూడా అమెరికాలో కేసు నమోదైంది.
ఇది కూడా చూడండి: MH: మహారాష్ట్రలో పని చేసిన పవన్ ప్రచారం..ఒక్క చోట మాత్రం..
నోటీసులకు వివరణ ఇవ్వకపోతే..
ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సాగర్‌కి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని అహ్మదాబాద్‌లో ఉన్న సాగర్ బోదక్ దేవ్ ఇంటికి ఈ నోటీసులు పంపింది. అయితే వీటిపై 21 రోజుల్లోగా కోర్టుకు వివరణ ఇవ్వాలని తెలిపింది. నోటీసులకు వివరణ ఇవ్వకపోతే.. తీర్పు వ్యతిరేకంగా ఉంటుందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ హెచ్చరించింది.
ఇది కూడా చూడండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఇదిలా ఉండగా.. భారతదేశపు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ విషయంలో అదానీ కంపెనీ అధికారులకు రూ.2200 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీతో అతని మేనల్లుడు సాగర్‌పై కూడా కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో ఏడుగురిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో అదానీ తప్పు చేశాడని రుజువు అయితే 2 మిలియన్ల డాలర్ల జరిమానా విధించడంతో పాట ఐదేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: నేడే ఐపీఎల్ మెగా వేలం.. ఏ ఫ్రాంఛైజీ దగ్గర ఎంత ఉందంటే?
ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా ఇన్వెస్టర్లను అదానీ మోసం చేసినట్లు అభియోగాలు వచ్చాయి. కాగా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అమెరికన్ సోలార్ ప్రొడక్షన్ కంపెనీలతో టైఅప్ అయ్యి ఇండియాలో 20 ఏళ్ల వరకు సౌరశక్తి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ కాంట్రక్ట్ తనకే దక్కాలని అదానీ దాదాపు రూ.2200 కోట్లు లంచం ఇచ్చాడని ఫారెన్ ఇన్వెస్టర్లు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చూడండి: పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది..చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో సంచలనాలు