పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది..చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో సంచలనాలు పక్కా ప్లాన్ ప్రకారమే ఏపీ సీఎం చంద్రబాబుపై రాళ్ళ దాడి జరిగినట్లు నందిగామ ఎసీపీ A.B.G తిలక్ తెలిపారు. సాయంత్రం 6:30లకు కరెంటు తీసి ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కేసులో 17 మంది నిందితులకు నోటీసులు ఇచ్చి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. By srinivas 24 Nov 2024 | నవీకరించబడింది పై 24 Nov 2024 07:28 IST in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP News: పక్కా ప్లాన్ ప్రకారమే ఏపీ సీఎం చంద్రబాబుపై రాళ్ళ దాడి జరిగినట్లు నందిగామ ఎసీపీ A.B.G తిలక్ తెలిపారు. సాయంత్రం 6:30లకు కరెంటు తీసి ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కేసులో 17 మంది నిందితులకు నోటీసులు ఇచ్చి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. కరెంట్ కట్ చేసి.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబుపై జరిగిన రాళ్ళ దాడి కేసులో నందిగామ ఎసీపీ A.B.G తిలక్ మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు. చంద్రబాబుపై రాళ్ళ దాడికి ముందస్తు పథకం ప్రకారం కుట్ర జరిగింది. మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ సెంటర్ వేళ్ళే సమయ లో ఈ ఘటన జరిగింది. మూడు టీమ్ లుగా ఏర్పడి దాడికి పాల్పడ్డారు. చంద్రబాబుకు తగలాల్సిన గాయం సెక్యూరిటీ ఆఫీసర్ అడ్డుకోవడంతో ఆయనకు తగిలింది. సాయంత్రం 6:30 సమయం లో కరెంటు తీసి దాడి చేయాలని పథకం ప్రకారం చేశారు. కరెంట్ తీసేందుకు కూడా ఒక టీం ఏర్పాటు చేశారు. ఒక చోట మిస్ అయితే మరో చోట దాడి చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పారు. ఇది కూడా చదవండి: MH: మహారాష్ట్రలో పని చేసిన పవన్ ప్రచారం..ఒక్క చోట మాత్రం.. ఇక ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు. వైసీపీకి చెందిన కోంతమంది నాయకుల హస్తంపై అనుమానాలు ఉన్నాయని, దర్యాప్తులో వీటిపై పూర్తి సమాచారం సేకరిస్తామన్నారు. ఈ కేసులో 17 మంది నిందితులు స్టేట్మెంట్ ఇచ్చారని, ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కానీ ఆ సమయంలో లో సరైన దర్యాప్తు జరగలేదు. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడి అని కేసును పక్కన పెట్టారు. ఈ కేసులో 307,120b,147,324,323,332,553,rw149 IPC ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్లు తిలక్ వెల్లడించారు. ఇది కూడా చదవండి: Cricket: హార్దిక్ అరుదైన రికార్డ్..లిస్ట్‌లో టాప్ క్రికెటర్ #ap cm chandrababu naidu press meet #cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి