MH: మహారాష్ట్రలో పని చేసిన పవన్ ప్రచారం..ఒక్క చోట మాత్రం.. మహారాష్ట్రా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల తరుఫున ర్యాలీల్లో పాల్గొన్నారు. మూడు భాషల్లో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన ప్రచారం చేసిన అన్ని చోట్లా బీజేపీ గెలిచింది ఒక్క లాతూర్‌లో తప్ప. By Manogna alamuru 24 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pawan Kalyan Campagin: పవన్ కల్యాణ్ మ్యాజిక్ బీజేపీకి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆయన మహారాష్ట్రా ఎన్నికల్లో ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులూ విజయం సాధించారు. తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చేసిన ప్రచారం మహారాష్ట్ర ఓటర్ల మీద బాగా ప్రభావం చూపించిందనే చెప్పాలి. అయితే ఒక్కచోట మాత్ర పవన్ మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. లాతూర్ నియోజకవర్గంలో మాత్రం పవన్ కళ్యాణ్ ప్రచారం ఏం ఉపయోగపడలేదు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ విలాస్ రావు దేశముఖ్ చేతిలో బీజేపీ అభ్యర్థి అర్చన పాటిల్ చాకుర్కర్ ఓడిపోయారు. ధీరజ్ హీరో రితేష దేశ్ ముఖ్ అన్నయ్య. దివంగత విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు. Also Read: Delhi: 50 ఏళ్ళల్లో ఈ కూటమీ ఇంతటి విజయాన్ని సాధించలేదు– మోదీ Also Read: జార్ఖండ్ కౌంటింగ్ పూర్తి..ఇండియా కూటమికి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా? లాతూర్‌లో ధీరజ్ విలాస్ రావు దేశ్ ముఖ్ కి 1 లక్ష 14వేల 110 ఓట్లు పోల్ అవ్వగా.. అర్చన చాకుర్కర్ కి 1 లక్ష 6 వేల 712 ఓట్లు వచ్చాయి. దీంతో అర్చనా 6 వేల 973 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ ఒక్కచోట మాత్రమే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం పనిచేయలేదు. ఇప్పుడు ఈ విషం మీద సోషల్ మీడియా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. सर्वांचे मनःपूर्वक आभार! pic.twitter.com/DkwP9Zzf0k — Dhiraj V Deshmukh (@MeDeshmukh) November 23, 2024 Also Read: Cricket: హార్దిక్ అరుదైన రికార్డ్..లిస్ట్‌లో టాప్ క్రికెటర్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి