USA Student Visas: ఇండియా నుంచి అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకునేవారి సంఖ్య ఏడాదికి ఏడాదికి పెరుగుతోంది. గతేడాది రికార్డ్ స్థాయిలో విద్యార్ధులకు వీసాలను జారీ చేసింది. మొత్తం లక్షా 40వేల విద్యార్థి వీసాలను జారీ చేసింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదు. అంతకు ముందు నాలుగేళ్ళకూ కలిపి ఇచ్చిన వీసాల కంటే 2023లో ఇచ్చిన వీసాల సంఖ్య ఎక్కువ. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ ఉండొచ్చని చెబుతోంది భారత రాయబార కార్యాలయం. దేశ వ్యాప్తంగా ఎనిమిదవ విద్యార్ధి వీసా వార్షికోత్సవాన్ని నిర్వహించింది. భారత్లోని అమెరికా ఎంబసీ.. దిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబయి కేంద్రాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు మొదలు పెట్టింది. దీంతో ఎంబసీ బయట భారీ క్యూ కనిపించింది.
పూర్తిగా చదవండి..Visa: విద్యార్ధి వీసాల ప్రక్రియ మొదలుపెట్టిన అమెరికా..గతేడాది కంటే ఎక్కువ
అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకునేవారికి ఇచ్చే విద్యార్ధి వీసాల ప్రక్రియను షురూ చేసింది అమెరికా. గతేడాది రికార్డ్ స్థాయిలో యూఎస్ వీసాలను ఇచ్చిందని.. యూఎస్ ఈసారి అంతకంటే ఎక్కువే వీసాలను జారీ చేయొచ్చని భారత రాయబార కార్యాలయం అంచనా వేసింది.
Translate this News: