/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/14-jpg.webp)
Urvashi Rautela With Jr NTR: బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా మరోసారి సౌత్ ప్రేక్షకులను ఊర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సినిమా అవకాశాలు లేక పలు భాషల్లో ఐటమ్స్ సాంగ్ చేస్తూ అలరిస్తున్న భామా తాజాగా మరో టాలీవుడ్ హీరో సరసన ఆడిపాడేందుకు ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య (Waltair Veerayya), ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరలోనూ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
@tarak9999 garu our beloved true #GlobalSuperstar —exceptionally disciplined, honest, and refreshingly straightforward, yet so wonderfully humble. Thanks a million for your kindness and the motivation. Your lion-hearted 🦁 personality is truly admirable. Can’t wait to work with… pic.twitter.com/iysWzhpOYY
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) April 15, 2024
ఇది కూడా చదవండి: Suriya: ‘కంగువ’ నుంచి సాలిడ్ పోస్టర్.. సూర్య లుక్ చూస్తే గూస్ బంప్సే!
తారక్ ఎంతో వినయంగా ఉంటారు..
అంతేకాదు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో దిగిన లేటెస్ట్ పిక్ నెట్టింట షేర్ చేసిన ఊర్వశీ అభిమానుల్లో ఉత్కంఠ రేపింది. 'గ్లోబల్ స్టార్ తారక్ ఎంతో వినయంగా ఉంటారు. మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. త్వరలోనే మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అంటూ ట్విటర్ వేదిగాక పోస్ట్ షేర్ చేసింది. దీనిపై తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఊర్వశీతో తారక్ డ్యాన్స్ చేస్తే పూనకాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తెలుగులో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇదిలావుటే.. ప్రస్తుతం తారక్.. హృతిక్ రోషన్ మూవీ వార్-2 (War 2) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
#Devara Part 1 releasing on 10.10.24. pic.twitter.com/AK4EvxQBz7
— Jr NTR (@tarak9999) February 16, 2024