UPSC Mains Results 2023 : అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల భర్తీ కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE)-2023 మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను UPSC శుక్రవారం విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15,16,17,23,24 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున సివిల్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు మే నెలలో నిర్వహించగా.. జూన్‌లోనే ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలో ఉన్న మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు UPSC గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఫరీక్షలో ర్యాంక్ సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఆ తర్వాత వారిని ఎంపిక చేస్తారు. ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Also read: వీళ్ల తెలివి పాడుగాను.. ఏకంగా ఫేక్ ‘టోల్ ప్లాజా’ ఏర్పాటు చేసి కోట్లు దండుకున్నారు..