Movies: రామ్‌చరణ్-ఉపాసన వివాహబంధానికి 12 ఏళ్ళు

రామ్ చరణ్, ఉపాసనకు పెళ్ళయి నిన్నటికి 12 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో పాప క్లీంకారతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 12 ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ అంటూ దానికి టైటిల్‌ కూడా పెట్టారు ఉపాసన.

Movies: రామ్‌చరణ్-ఉపాసన వివాహబంధానికి 12 ఏళ్ళు
New Update

Ram Charan - Upasana Wedding Anniversary: రామ్‌చరణ్-ఉపాసన ఈ తరం వారికి ఆదర్శమనే చెప్పాలి. ఇద్దరూ తమ తమ ఫీల్డ్స్‌లో రాణిస్తూనే తమ వైవాహిక బంధాన్ని కూడా అంతే అందంగా కొనసాగిస్తున్నారు. నిన్నటితో వారికి పెళ్ళయి 12 ఏళ్ళు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఉపాసన సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. 12 ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్” అంటూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో రామ్ చరణ్ తేజ్, ఉపాసన కలిసి తమ కూతురు క్లింకారా (Klinkaara) చేతులు పట్టుకున్నారు. ఈ ఫోటోలో కూడా క్లింకారా మొఖం కనపడకుండా వెనుక నుండి ఫోటో తీసి పోస్ట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఇన్నేళ్ళ తమ బంధంలో తమకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఉపాసన. రామ్ చరణ్ కూడా ఉపాసన పోస్టుకి “ఉప్సి ఐ ఎంజాయ్ బీయింగ్ యువర్ బెటర్ హాఫ్” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు సోషల్ మీడియా లో వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read: రెసిడెన్షియల్ పాఠశాలలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ తీసుకోవాలి-మంత్రి దామోదర రాజనర్సింహ

#upasana #game-changer #ram-charan #marriage-anniversary-pic
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe