/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-6-7.jpg)
Ram Charan - Upasana Wedding Anniversary: రామ్‌చరణ్-ఉపాసన ఈ తరం వారికి ఆదర్శమనే చెప్పాలి. ఇద్దరూ తమ తమ ఫీల్డ్స్‌లో రాణిస్తూనే తమ వైవాహిక బంధాన్ని కూడా అంతే అందంగా కొనసాగిస్తున్నారు. నిన్నటితో వారికి పెళ్ళయి 12 ఏళ్ళు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఉపాసన సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. 12 ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్” అంటూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో రామ్ చరణ్ తేజ్, ఉపాసన కలిసి తమ కూతురు క్లింకారా (Klinkaara) చేతులు పట్టుకున్నారు. ఈ ఫోటోలో కూడా క్లింకారా మొఖం కనపడకుండా వెనుక నుండి ఫోటో తీసి పోస్ట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
Here’s to 12 years togetherness! ❤️♾️
Thank you all for your love & wishes.
Each one of you have played a special part in making our lives truly wonderful.
So much gratitude! 🙏🥰@AlwaysRamCharan #klinkaarakonidela pic.twitter.com/x6tvQgR5M0— Upasana Konidela (@upasanakonidela) June 15, 2024
ఇన్నేళ్ళ తమ బంధంలో తమకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఉపాసన. రామ్ చరణ్ కూడా ఉపాసన పోస్టుకి “ఉప్సి ఐ ఎంజాయ్ బీయింగ్ యువర్ బెటర్ హాఫ్” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు సోషల్ మీడియా లో వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read: రెసిడెన్షియల్ పాఠశాలలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ తీసుకోవాలి-మంత్రి దామోదర రాజనర్సింహ