Upasana : క్లీంకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఉపాసన

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపాసన కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి కూతురు క్లీంకారతో ఉపాసన హాజరయ్యారు. అయితే, ఈ వేడుకలో కూడా క్లీంకార ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

Upasana : క్లీంకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఉపాసన
New Update

Upasana - Ram Charan : గ్లోబల్ స్టార్(Global Star) రామ్ చరణ్(Ram Charan) భార్యగానే కాకుండా, బిజినెస్ ఉమెన్(Business Woman) గా కూడా ఉపాసన(Upasana) చాలా పాపులర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్ గా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉపాసన తన సోషల్ మీడియా(Social Media) లో షేర్ చేస్తూ ఉంటారు.

Ram Charan - Upasana

తాజాగా, ఉపాసన తన కూతురు క్లిన్ కారా(Klin Kaara) తో కలిసి హైదరాబాద్(Hyderabad) లో గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ని కలిశారు. అందుకు సంబంధించిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

Also Read : విడాకులకు సిద్దమైన రాజ్.. బెడిసికొట్టిన ఇందిరాదేవి ప్లాన్.. ముక్కలైన కావ్య జీవితం..!

ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ లో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముజీ గారిని నా కుమార్తె క్లిన్‌ కారా కొణిదెలతో కలవడం చాలా ఆనందంగా ఉందని కామెంట్స్ చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కామేష్ దాజి మీకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.

Upasana

దీంతో ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే, ఈ వేడుకలో కూడా క్లీంకార ముఖం కనిపించకుండా ఉపాసన చాలా జాగ్రత్త పడ్డారు. దీంతో మెగా అభిమానులు ఇంకెప్పుడు ఈ మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ ని చూపిస్తారు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

#draupadi-murmu #klin-kaara #ram-charan #upasana-konidela
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe