IAS,IPS: ఆ ఊరంతా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే.. ఎక్కడో తెలుసా..

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ జిల్లాలో మాధోపట్టి అనే గ్రామంలో ఏకంగా 51 మందికి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా ఎంపికై వివిధ రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. దేశంలోనే ఎక్కవ మంది సివిల్‌ సర్వీసెస్ అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచిపోయింది.

New Update
IAS,IPS: ఆ ఊరంతా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే.. ఎక్కడో తెలుసా..

Madhopatti Village IAS Officers: మన ఇండియాలో ఐఏఎస్, ఐపీఎస్‌ లాంటి సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలకు అత్యంత గౌరవం ఇస్తారు. ప్రతి సంవత్సరం UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం దేశంలో లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ పరీక్ష కోసం ఏళ్ల తరబడి ప్రిపెర్‌ అవుతారు. మరికొందరు లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకుంటారు. యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించి.. ఇంటర్వ్యూలో కూడా పాస్‌ కావాలంటే చాల కష్టంతో కూడుకున్న పని. ఎవరైన ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌గా ఎంపికయ్యారంటే వారికిచ్చే గౌరవ మర్యాదలే వేరు. జిల్లాకు కొంతమంది మాత్రమే ఇందుకు సెలక్ట్‌ అవుతారు. కానీ ఒక ఊరిలో మాత్రం ఏకంగా 51 మందికి పైగా ఐఏఎస్‌ (IAS), ఐపీఎస్‌ (IPS) లుగా ఎంపికై సేవలు అందిస్తున్నారు.

Also Read: అన్ని పార్టీల కంటే బీజేపీకి ఐదు రెట్లు ఎక్కువ విరాళాలు.. కాంగ్రెస్‌ కు ఎంత వచ్చాయో తెలుసా!

ఐఏఎస్‌ ఫ్యాక్టరీ

మరో విషయం ఏంటంటే ఆ గ్రామంలో ఉండేది కేవలం 75 ఇళ్లు మాత్రమే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ (Jaunpur) జిల్లాలో మాధోపట్టి (Madhopatti) అనే గ్రామం ఉంది. ఈ ఊరిలో ఇప్పటిదాకా 52 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. అందుకే ఈ గ్రామాన్ని ఐఏఎస్‌ ఫ్యాక్టరీ (IAS Factory) అని పిలుస్తున్నారు. దేశంలోనే ఎక్కవ మంది సివిల్‌ సర్వీసెస్ అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచిపోయింది. ఏవైన పండుగలు వచ్చినప్పుడు ఆ అధికారులు తమ స్వంత గ్రామానికి వస్తారు. అప్పుడు ఆ ఊరంతా ప్రభుత్వ అధికార వాహనాలతో సందడిగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

వారి వళ్లే

అయితే ఈ గ్రామంలో అసలు కోచింగ్‌ సెంటర్‌లు కూడా లేవు. ఇక్కడ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా రాణిస్తుండటం విశేషం. ఈ గ్రామం నుంచి వచ్చిన వాళ్లలో అంతరిక్షం, అణు పరిశోధన, బ్యాంకింగ్, న్యాయ సేవలు వంటి వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఓ ఇంట్లో నలుగురు అన్నదమ్ముల్లు ఉండగా.. వాళ్లందరు కూడా ఐఏఎస్‌ అధికారులు కావడంతో ఆ గ్రామానికి మరింత పేరు వచ్చింది. మరో విషయం ఏంటంటే ఆ గ్రామం స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాలుపంచుకుంది. అయితే స్వాతంత్ర ఉద్యమకారుడు అయిన ఠాకూర్‌ భగవతి దిన్‌ సింగ్ (Thakur Bhagwati Din Singh).. అతని భార్య శ్యామరాతి సింగ్.. 1917లో పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

Also Read: మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్‌ ..ఎలక్టోరల్‌ బాండ్స్‌ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

Advertisment
Advertisment
తాజా కథనాలు