/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం దారుణం ఘటన బయటపడింది. లక్నోలోని సర్వన్ నగర్లో నివాసం ఉంటున్న రామ్‌లఖన్ అనే వ్యక్తి.. తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి బ్యాగులో కుక్కాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు వారి మృతదేహాలను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. అయితే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగచూసింది.
Also Read: బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌లో గెలిస్తే.. రాజ్యాంగం నాశనమవుతుంది : రాహుల్ గాంధీ
రామ్‌లఖన్ ముందుగా తన భార్యకు స్కార్ఫ్‌తో ఉరివేసి చంపేశాడు. ఆ తర్వాత నిద్రిస్తున్న పిల్లలను హతమర్చాడు. భార్య పిల్లల్ని హత్య చేసిన తర్వాత తన ఇంటి నుంచి రామ్‌లఖన్ పారిపోయాడు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతడి సెల్‌ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకుని అదుపులోకి తీసుకున్నాయి. రామ్‌లఖన్ భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే అతడు ఈ హత్యలు చేసినట్లు అక్కడి స్థానిక పోలీసులు భావిస్తున్నారు. భార్య పిల్లలు పక్కనే నిద్రిస్తున్నారని అనుకోడవం కోసమే వాళ్ల మృతదేహాలు ఇంట్లో ఉంచుకున్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు.
Also Read: రాసలీలల ఆర్ఎంపీ అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు