Uttar Pradesh : వాడు మనిషి కాదు... నరరూప రాక్షసుడు.. పిల్లలను చంపి రక్తం తాగాడు

అన్నెంపున్నెం ఎరుగని చిన్న పిల్లలను చంపడమే కాక..వారి రక్త తాగారు ఇద్దరు యువకులు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇద్దరు ముస్లిం యువకులు చేసిన హత్యాకాండలో ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలు అన్యాయంగా చనిపోయారు.

New Update
Uttar Pradesh : వాడు మనిషి కాదు... నరరూప రాక్షసుడు.. పిల్లలను చంపి రక్తం తాగాడు

Two young Men Killed Two Kids Brutally : బదౌన్‌(Budaun) లో ఇద్దరు చిన్నారుల మృతి గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లో జరిగిన ఈ ఘటన అందరి చేత కంటనీరు పెట్టిస్తోంది. ఇద్దరు యువకుల ఆకృత్యాలకు ఇద్దరు చిన్నపిల్లలు అన్యాయంగా బలయిపోయారు. ఉత్తపుణ్యాన వారింటికి వెళ్ళి మరీ చంపేశారు(Killed). పెద్దవాళ్ళ మధ్య గొడవలు చిన్న పిల్లల ప్రాణాలు తీశాయి. పాత కక్షలను మనసులో పెట్టుకుని రెండు నిండు ప్రాణాలను బలిగొన్నారు ఉత్తరప్రదేశ్ జిల్లా బదౌన్ గ్రామంలోని సాజిద్, జావేద్ అనే ఇద్దరు యువకులు. రాక్షసంగా పిల్లల మెడను బ్లేడ్‌తో కోసి చంపడమే కాకుండా...వారి రక్తాన్ని కూడా తాగి పైశాచిక ఆనందాన్ని పొందారు.

రక్తం తాగారు...

యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్బర్ షాప్(Barber Shop) నిర్వహిస్తున్న సాజిద్(Sajid) అనే వ్యక్తి ఉదయం 8 గంటల ప్రాంతంలో తన షాపు ముందు ఉన్న వినోద్(Vinod) అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. వీరిద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉందని, వారి మధ్య పాత గొడవలు జరుగుతున్నాయని సమాచారం. వినోద్ ఇంటికి వెళ్లిన సాజిద్ ముందుగా వినోద్‌ భార్యని టీ చేయమని అడిగాడు.తర్వాత టెర్రస్‌పైకి వెళ్లి వినోద్‌ ముగ్గురు పిల్లలు ఆయుష్‌, అహాన్‌, పీయూష్‌లపై బ్లేడ్‌(Blade) తో దాడి చేశాడు. ఇందులో ఆయుష్(14), హనీ (6) వీరిద్దరి మెడను బ్లేడ్‌తో కోశాడు. ఆతర్వాత వారి రక్తాన్ని కూడా తాగాడు. ఈ దాడిలో ఆయుష్ , హనీ అక్కడిక్కడే మరణించారు. వీళ్ళ తర్వాత మూడో పిల్లాడు పీయూష్ మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు సాజిద్, జావేద్‌లు. అయితే పియూష్ ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కిందకు వెళ్ళి కేకలు వేయడంతో వెంటనే జనం పోగయ్యారు. ఈ తప్పించుకోవడంలో పియూష్‌కు స్వల్ప గాయాలు కావడంతో.. అతను స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

publive-image

వెంటనే పారిపోయిన నిందితులు..
ఇద్దరు చిన్నారులను హత్య(Murder) చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే విషయం తెలిసిన వెంటనే పోలీసులు వారికోసం గాలించారు. ఇందులో భాగంగా నిందితులను పోలీసులు పట్టుకోబోతే వారి మీద దాడికి ప్రయత్నించాడు సాజిద్. దీంతో సాజిద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌(Encounter) లో హతమార్చారు. హత్యలో పాల్గొన్న జావేద్ పోలీసులకు చిక్కలేదు. మృతుల తల్లి చెప్పిన ఆధారాల ప్రకారం జావేద్ కూడా హత్యలో పాల్గొన్నాడు.

చెలరేగిన అల్లర్లు...
బదౌన్‌ లో ఈ దారుణ హత్యాకాండతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చనిపోయిన పిల్లలు ఇద్దరూ హిందువులు కావడం...నిందితులు ముస్లిం యువకులు కావడంతో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. వీటిని అదులో ఉంచేందుకు ఏడీజీ బరేలీ, ఐజీ రాకేష్ సింగ్ ఘటనా స్థలంలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. చిన్నారులను మృతదేహాలను పోస్ట్ మార్టమ్‌కు తరలించారు.

Also Read : Elections : హోమ్‌లెస్ ఓటర్లను ఎలా గుర్తిస్తారు?

Advertisment
తాజా కథనాలు