Uttar Pradesh : మహిళా కానిస్టేబుల్‌తో డీఎస్పీ అక్రమ సంబంధం.. కట్ చేస్తే కానిస్టేబుల్‌గా డిమోట్

ఉత్తరప్రదేశ్‌లోని ఓ డీఎస్పీ స్థాయి పోలీసు అధికారికి అక్కడి పోలీసు విభాగం తగిన బుద్ధి చెప్పింది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నేరానికి పాల్పడిన ఆ డీఎస్పీని.. కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేసింది.

New Update
Uttar Pradesh : మహిళా కానిస్టేబుల్‌తో డీఎస్పీ అక్రమ సంబంధం.. కట్ చేస్తే కానిస్టేబుల్‌గా డిమోట్

DSP Illegal Affair : కొంతమంది వ్యక్తులు అక్రమ సంబంధాలు (Illegal Affair) పెట్టుకుని తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. వీటికోసం ప్రాణాలు కూడా తీసుకున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని ఓ డీఎస్పీ స్థాయి పోలీసు అధికారికి అక్కడి పోలీసు విభాగం తగిన బుద్ధి చెప్పింది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని నేరానికి పాల్పడిన ఆ డీఎస్పీని.. కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రిపా శంకర్ కనౌజియా అనే వ్యక్తి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎదుగుతూ డీఎస్పీ స్థాయి వరకు చేరుకున్నాడు.

Also Read: నీట్‌ పరీక్ష అక్రమాలపై సీబీఐ కేసు నమోదు..

అయితే మూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహేతర సంబంధం (Extra Marital Affair) పెట్టుకోని అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన జరిగిన సమయంలో కనౌజియా ఉన్నావ్‌లో సర్కిల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కారణాలు చెప్పి ఎస్పీ పర్మీషన్‌తో సెలవు తీసుకున్నాడు. కానీ ఇంటికి వెళ్లకుండా ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పుర్‌లోని ఒక హోటల్‌కు వెళ్లాడు. అక్కడ అధికారిక, వ్యక్తిగత ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశాడు. అదే సమయంలో కనౌజి భార్య అతడికి ఫోన్ చేసింది. కానీ ఫోన్‌ కలవకపోవడంతో ఉన్నావ్‌ ఎస్పీకి కాల్‌ చేసింది.

దీంతో వెంటనే దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు కాన్పూర్ హోటల్‌లో అతడి చివరిసారి ఫోన్ లోకేషన్‌ను గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకొని ఇద్దరినీ పట్టుకున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అప్పటి లఖ్‌నవూ రేంజ్ ఐజీపీ విచారణకు ఆదేశించారు. కనౌజిపై క్రమశిక్షణారాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశాడు. ఈ ఘటనపై ఇటీవలే విచారణ పూర్తి అయ్యింది. చివరికి పోలీసు విభాగం.. డీఎస్పీ హోదా ఉన్న కనౌజిని గోరఖ్‌పూర్‌ బెటాలియన్‌లోని ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ’లో కానిస్టేబుల్‌గా డిమోట్ చేసింది.

Also Read: పోలీసులపై దాడి.. మియాపూర్‌లో 144 సెక్షన్ అమలు

Advertisment
తాజా కథనాలు