Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట..

2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈరోజు యూపీలోని సుల్తాన్‌పుర్ జిల్లా కోర్టులో రాహుల్ హాజరుకాగా.. ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

New Update
Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట..

Rahul Gandhi Granted Bail: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై (Amit Shah) చేసిన వ్యాఖ్యలకు గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ప్రస్తుతం భారత్‌ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్న రాహుల్‌ (Rahul Gandhi).. కేసు విచారణ నిమిత్తం మంగళవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. దీంతో సుల్తాన్‌పుర్‌ జిల్లా కోర్టు (UP Court).. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

Also Read: లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. పీపుల్స్‌ పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సర్వే ఇదే..

అమిత్‌షా పై అభ్యంతకర వ్యాఖ్యలు

కర్ణాట అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) సమయంలో 2018 మే 8న బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్‌.. హోంమంత్రి అమిత్‌ షాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకుడు విజయ్‌ మిశ్రా ఆరోపించారు. దీంతో అదే ఏడాది ఆగస్టు 4న రాహుల్‌పై పరువు నష్టం కేసు వేశారు. బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలకు కట్టుబడి ఉందని చెబుతూనే మరోవైపు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఆ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకుందని రాహుల్‌ గాంధీ అన్నారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో అమిత్‌ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పట్లో ఈ అంశం రాజకీయంగా దుమారం రేపింది.

బెయిల్‌ ఆమోదించిన కోర్టు

ఈ క్రమంలోనే యూపీకి చెందిన బీజేపీ నేత విజయ్‌ మిశ్రా (Vijay Mishra) రాహుల్‌పై ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గతంలో పలుమార్లు న్యాయస్థానం రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన స్పందించలేదు. తాజాగా విచారణకు హాజరవ్వడంతో.. కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రాహుల్‌ తరుఫున న్యాయవాది సంతోష్‌ పాండే మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ గాంధీ బెయిల్‌ దరఖాస్తు సమర్పించడంతో.. కోర్టు ఆమోదించిందని పేర్కొన్నారు. ఈ కేసులో రాహుల్ నిర్దోషి అని పరువు నష్టం కలిగించే విధంగా ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పారు. తదుపరి విచారణ తేదిని కోర్టు ఇంకా ప్రకటించలేదని చెప్పారు.

Also Read: లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటన అప్పుడే.. !

Advertisment
Advertisment
తాజా కథనాలు