Ayodhya Ram Mandir: అయోధ్యలో భక్తుల కోసం కొత్త యాప్.. ఎందుకంటే..

అయోధ్యలో రాముని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు 'దివ్య్‌ అయోధ్య' అనే యాప్‌ను ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ యాప్‌ను వినియోగించి.. వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు.

New Update
Ayodhya Ram Mandir: అయోధ్యలో భక్తుల కోసం కొత్త యాప్.. ఎందుకంటే..

Divya Ayodhya Mobile APP: అయోధ్యలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాముని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు 'దివ్య్‌ అయోధ్య' (Divya Ayodhya) అనే యాప్‌ను ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) విడుదల చేశారు. ఈ యాప్‌ను వినియోగించి.. అయోధ్యలోని వివిధ ఆలయాలు అలాగే ఆధ్యత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే హోటళ్లు, గుడరాలు, వీల్‌ఛైర్ అసిస్టెంట్, ఎలక్ట్రిక్ వాహనలను, టూరిస్టు గైడ్‌లను ముందుగానే బుకింగ్ చేసుకనే వీలుంటుంది.

Also Read: అయోధ్య రాముడిని హెలీకాప్టర్లో తిరుగుతూ చూసేయొచ్చు.. 

అయితే ఈ యాప్‌ ఇప్పుడు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. దీన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా స్థానిక వంటలు, కచ్చితంగా చూడాల్సి ఉన్న ప్రదేశాలు, టూర్ ప్యాకేజీలకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు. మరోవైపు యూపీ ప్రభుత్వం (UP Govt) అయోధ్యను ఆధ్యాత్మిక పర్యాటకంగా మార్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు రెడీ చేసింది. ఇందులో భాగంగానే అయోధ్య (Ayodhya) శివార్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించాలని భావిస్తోంది.

హోమ్‌ స్టే కోరుకునే భక్తుల కోసం ఈ ఇళ్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కూడా అయోధ్యను సందర్శించే భక్తుల కోసం మరిన్ని మౌళిక సదుపాయలు కూడా కల్పించనున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి లక్నో-అయోధ్య మధ్య హెలికాప్టర్‌ సర్వీస్‌ను కూడా ప్రారంభించనున్నారు.

Also Read: అందుకే విచారణకు రావడం లేదు.. ఈడీకీ లేఖ రాసిన కవిత..

ఇదిలా ఉండగా.. ఆలయ ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశంలోని పలువురు ప్రముఖులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా అందాయి. దాదాపు 11 వేల మందికి పైగా అతిథులు రానున్నారని ఆలయ ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం కూడా చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు