Telangana : బీఆర్ఎస్ బిల్లు రద్దు.. పాత పద్ధతిలోనే యూనివర్సిటీల నియామకాలు?

తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి సంబంధించి రేవంత్ సర్కార్ మరో అడుగుముందుకేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు’ను రద్దు చేసి పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టబోతున్నట్లు సమాచారం.

Telangana : బీఆర్ఎస్ బిల్లు రద్దు.. పాత పద్ధతిలోనే యూనివర్సిటీల నియామకాలు?
New Update

Revanth Sarkar Action Plan : తెలంగాణ యూనివర్సిటీ(Telangana University) ల్లో టీచింగ్(Teaching), నాన్ టీచింగ్(Non Teaching) ఖాళీల భర్తీకి సంబంధించి రేవంత్(CM Revanth) సర్కార్ కసరత్తులు మొదలుపెట్టింది. కొంతకాలంగా ఖాళీగా ఉన్న పలు పోస్టులను ఫిల్ చేసేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. మొత్తం ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సంబంధించి 2,825 టీచింగ్‌ పోస్టులుండగా ఇందులో ప్రస్తుతం 848 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కాంగ్రెస్(Congress) హామీ ఇచ్చిన ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాల భర్తీలో భాగంగానే ఈ నియామకాలను కూడా భర్తీ చేసే ఆలోచనలో ఉండగా.. ఈ రిక్రూట్ మెంట్ మళ్లీ పాతపద్ధతిలోనే చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ బిల్లు ఉపసంహరణ..
ఈ మేరకు రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకోసం బీఆర్ఎస్(BRS) గవర్నమెంట్ తీసుకొచ్చిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు’ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే ఈ నియమకాల ప్రక్రియను కొనసాగించేందకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దీనిపై రాజ్‌భవన్‌తో సీఎంవో సంప్రదింపులు జరిపగా.. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ఉపసంహరణకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని ఆదేశించారు. దీంతో ఈ బిల్లు ఉపసంహరణకు రాజ్‌భవన్‌తో సీఎంవో, విద్యాశాఖ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇక పాతపద్ధతిలో ఏ యూనివర్సిటీ పరిధిలోని పోస్టులను ఆయా వర్సిటీలే నోటిఫికేషన్లు జారీచేసి, భర్తీచేస్తారు. ఆయా పోస్టుల భర్తీకి ఎలాంటి స్క్రీనిం గ్‌ టెస్ట్‌ ఉండదు. సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ విధానంలో నియామకాలను పూర్తిచేస్తారు.

ఇది కూడా చదవండి : Testosterone: పురుషుల్లో మానసిక కల్లోలం.. టెస్టోస్టెరాన్ హెచ్చుతగ్గులే కారణమా!

అమోదించని గవర్నర్.. 
రాష్ట్రంలోని వర్సిటీల్లో బోధన పోస్టుల భర్తీకి గాను కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును కేసీఆర్‌ సర్కారు(KCR Sarkar) ఏర్పాటు చేసింది. స్క్రీనింగ్‌ టెస్ట్‌ (రాతపరీక్ష) ద్వారా ప్రతిభావంతులను ప్రొఫెసర్లుగా నియమించేందుకు బోర్డును ఏర్పాటుచేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ‘ది తెలంగాణ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ బి ల్లుకు 2023 సెప్టెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే పలు సందేహాలుండటంతో గవర్నర్‌ ఈ బి ల్లును ఆమోదించలేదు. దీంతో అప్పటి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, అధికారులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై సందేహాలకు వివరణ ఇచ్చారు. ఈ వివరణకు సంతృప్తి చెందని గవర్నర్‌ యూజీసీ చైర్మన్‌కు లేఖ రాశారు. యూజీసీ నిబంధనల ప్రకారమే రిక్రూట్‌చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు తెలిపింది. అయినా సంతృప్తి చెందని గవర్నర్‌ ఆ తర్వాత బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు.

#telangana #jobs #universities #revanth-sarkar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe