SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీకి యూనివర్సల్ టైటిల్.. ఏంటంటే?

మహేష్ బాబు - రాజమౌళి కాంబో మూవీకి ‘గోల్డ్‌’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తాజా సమాచారం. ట్రెజర్‌ హంట్‌ నేపథ్యంలో సాగే కథాంశం కావడం చేత, 'గోల్డ్‌' అనే టైటిల్‌ ఈ కథకు యాప్ట్‌గా ఉంటుందని, పైగా ఇది యూనివర్సల్‌ టైటిల్‌ కాబట్టి.. ఈ టైటిలే కరెక్ట్‌ అని రాజమౌళి భావిస్తున్నారట.

SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీకి యూనివర్సల్ టైటిల్.. ఏంటంటే?
New Update

Rajamouli - Mahesh Babu Movie : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ పాన్‌ వరల్డ్‌ మూవీకి ‘గోల్డ్‌’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ట్రెజర్‌ హంట్‌ నేపథ్యంలో సాగే కథాంశం కావడం చేత, 'గోల్డ్‌' అనే టైటిల్‌ ఈ కథకు యాప్ట్‌గా ఉంటుందని, పైగా ఇది యూనివర్సల్‌ టైటిల్‌ కాబట్టి.. ఈ టైటిలే కరెక్ట్‌ అని రాజమౌళి భావిస్తున్నారట. ఇందులో మహేశ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ తో పాటూ ఇందులో ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారని తెలుస్తోంది.

Also Read : విశాల్ ను టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అతనితో ఎవరూ సినిమాలు చేయొద్దంటూ వార్నింగ్, హీరో స్ట్రాంగ్ రిప్లై!

నిర్మాత కె.ఎల్. నారాయణ సుమారు వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త కొత్త లుక్‌ లో కనిపించనున్నారు. సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ 2025 చివరి నాటికి లేదా 2026 మొదటి భాగంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.

Also Read: నిహారిక కొణిదెల.. ‘కమిటీ కుర్రాళ్ళు’ ట్రైలర్..!

#ss-rajamouli #ssmb29-movie #mahesh-babu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe