USA: వణికిస్తున్న ఫ్లూ.. 15 వేల మంది మృతి..

అమెరికాలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 2 లక్షల 50 వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఇందులో 15 వేల మంది మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్‌ఫ్లుయెంజా బారినపడ్డ చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

New Update
USA: వణికిస్తున్న ఫ్లూ.. 15 వేల మంది మృతి..

అమెరికా ప్రజలను ఫ్లూ వణికిస్తోంది. లాస్‌ ఏంజెల్స్‌లోని సెంటర్స్‌ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విడుదల చేసిన తాజా సమాచారం చూసుకుంటే.. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అక్కడ రెండు లక్షల 50 వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో 15 వేల మంది మరణించడం కలకలం రేపింది.

Also Read: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్!

ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్‌ఫ్లుయెంజా బారినపడ్డ చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ సీజన్‌లో మొత్తం 74 మంది చిన్నారులు ఇన్‌ఫ్లుయెంజాతో ఆసుపత్రి పాలయ్యారు. గడిచిన వారంలో ఏకంగా 11 వేల మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చేరినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. ఇన్‌ఫ్లుయేంజా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసకున్నారు. ఆరు నెలల లోపు ఉన్న చిన్నారులకు వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలని సూచిస్తున్నారు.

Also Read: అమెరికా కీలక నిర్ణయం.. ‘ఏఐ వాయిస్‌ రోబోకాల్స్‌’పై నిషేధం

Advertisment
తాజా కథనాలు