United Nations : భారత్(India) లో ఇటీవల ఐటీశాఖ కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఖాతాలను ఫ్రీజ్ చేయడం, అలాగే తాజాగా ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం లాంటి విషయాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి(UNO) స్పందించింది. ఇండియాలో లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీ నేత సీఎం అరెస్టు కావడం, కాంగ్రెస్ పార్టీ ఖాతాలు నిలిపివేయడం లాంటి రాజకీయ పరిస్థితులపై ఓ విలేకరి ప్రస్తావించారు. అయితే ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పందిచారు.
Also Read : బీజేపీకి ఆ విషయం అర్థం కావడం లేదు.. కేంద్రంపై పి.చిదంబరం ఫైర్
‘ఇండియా.. అలాగే ఎన్నికలు జరిగే ప్రతి దేశంలో కూడా ప్రజల రాజకీయ, పౌరహక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నాం. న్యాయమైన, స్వేచ్ఛా వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని విశ్వాసిస్తున్నామని' అన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) అరెస్టుపై జర్మనీ, అమెరికా దేశాలు స్పందించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల సీజ్‌పై అమెరికా రెండోసారి కూడా స్పందించింది.
ఈ రెండు దేశాల తీరుపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది దేశ అంతర్గత విషయమని.. తమ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొంది. ఇదిలాఉండగా.. పార్లమెంటు ఎన్నికల వేళ.. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఆయన అరెస్టుపై స్పందించిన విపక్ష పార్టీల నేతలు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు.
Also Read : కృత్రిమ మేధ మీద చాయ్ పే చర్చా..బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ