Budget 2024 For AP & TS: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గురువారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాలకు సంబంధించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.5,071 కోట్లు కేటాయించామని, రాష్ట్రంలో రైల్వే పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని అన్నారు. అలాగే 100 శాతం విద్యుదీకరణ పూర్తైనట్లు తెలిపారు. ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని.. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని అన్నారు.
Also Read: మధ్యంతర బడ్జెట్.. ఏ శాఖకు ఎంత కేటాయింపు.. పూర్తి వివరాలు
ఇక ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల (Railway) అభివృద్ధి కోసం రూ.9138 కోట్లు కేటాయించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2009 నుంచి 2014 వరకు రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. ఇప్పుడు ఏపీకి కేటాయించిన బడ్జెట్‌లో ఇది 10 శాతం రెట్టింపు అని అన్నారు. ఏడాదికి 240 కిలోమీటర్ల ట్రాక్ పనులు జరుగుతున్నాయని.. అలాగే రాష్ట్రంలో 98 శాతం విద్యుదీకరణ పూర్తైనట్లు పేర్కొన్నారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు 53 ఎకరాల భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగామని.. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు భూమి అప్పగించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే.. అప్పుడు పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జోన్ ఏర్పాటు చేసేందుకు డీపీఆర్ కూడా సిద్ధమైనట్లు స్పష్టం చేశారు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 9వేల ఉద్యోగాలు