కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేరళ బీజేపీ ఎంపీ సురేష్ గోపీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ది నేషన్'గా అభివర్ణించారు. శనివారం కేరళలోని కాంగ్రెస్ నేత కరుణాకరణ్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించిన సందర్భంగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు. అలాగే కరుణాకరణ్‌తో సహా మాజీ ముఖ్యమంత్రి ఈకే నయనార్ తనకు రాజకీయ గురువులని చెప్పారు. కేరళలో ఉన్న కాంగ్రెస్‌కు కరుణాకరణ్ తండ్రిలాంటి వారని అన్నారు. అయితే తాను చేసిన ఈ వ్యాఖ్యలను రాజకీయాలకు ఆపాదించవద్దని మీడియాను కోరారు.
Also Read: లోక్‌సభ స్పీకర్‌గా మళ్లీ ఆయనేనా !
ఇదిలాఉండగా ఇటీవల కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ గోపీ.. తనకు కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి లేదని ఎంపీగానే ఉంటూ కేరళ ప్రజలకు సేవ చేయాలని ఉందని చెప్పడం సంచలనం రేపింది. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సురేష్ గోపి స్పందించారు. తాను రాజీనామా చేస్తున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారాన్ని చేశాయని అన్నారు. ఈసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ మొదటిసారిగా ఒక సీటును గెలుచుకుంది. త్రిసూర్ నుంచి బరిలోకి దిగిన సురేష్ గోపి 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి తొలి బీజేపీ ఎంపీగా రికార్డు సృష్టించారు.
Also Read: బీజేపీపై ఆర్ఎస్‌ఎస్ ఘాటు విమర్శలు..