/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/meenakshi-jpg.webp)
Minister Meenakhi Lekhi: తాను ప్రసంగం చేస్తున్న సభలోని వారు ''భారత్ మాతా కీ జై'' అనలేదని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆమె ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో ఆమె కోజికోడ్ లో జరిగిన యువజన సదస్సులో పాల్గొన్నారు. ఆమె యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రసంగం మొత్తం ముగిసిన తరువాత సభలోని వారందరూ కూడా '' భారత్ మాతా కీ జై'' అన అనాలని తెలిపారు. కానీ ఆమె అనుకున్నట్లు అక్కడ వారు భారత్ మాతా కీ జై అనే స్లోగన్ ఇవ్వలేదు. దీంతో మంత్రి కొంత అసహనానికి గురైయ్యారు. దీంతో దేశం పట్ల గౌరవం లేని వారు ఈ సభలో ఉండాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఓ మహిళను ఆమె భారత్ మాతా మీ తల్లి కాదా అని ప్రశ్నించగా ఆమె ఏమి సమాధానం చెప్పలేదు. దీంతో ఆమెను సభ నుంచి బయటకు వెళ్లిపోమ్మని గట్టిగా అన్నారు. దేశం గురించి గర్వంగా చెప్పుకోలేని వారు ఈ సభలో ఉండాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.
కేంద్ర మంత్రి అన్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుంటే మరికొంత మంది మాత్రం ఆమెను వ్యతిరేకిస్తున్నారు.
Also read: 8 ఏళ్ల బ్యాటరీ గ్యారంటీతో ..మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్!