OLA: 8 ఏళ్ల బ్యాటరీ గ్యారంటీతో ..మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్! ఓలా ..తన సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. ఎస్ 1, ఎక్స్ 4 కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ మోడల్ తో కొత్త బైక్ ను తీసుకుని వచ్చింది. దీనిని కేవలం రూ. 1.10 లక్షలకే వినియోగదారులకు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. By Bhavana 04 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి OLA: ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా(OLA) ..తన సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను (Electric Bike) మార్కెట్ కు పరిచయం చేసింది. ఎస్ 1(S1), ఎక్స్ 4 కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ మోడల్ తో కొత్త బైక్ ను తీసుకుని వచ్చింది. దీనిని కేవలం రూ. 1.10 లక్షలకే వినియోగదారులకు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కు ఒకసారి ఛార్జీంగ్ పెడితే చాలు సుమారు 190 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని సంస్థ వెల్లడించింది. దీనికి 6. గంటల 30 నిమిషాల ఛార్జీంగ్ చేస్తే చాలని కంపెనీ అధికారులు తెలిపారు. 90 కేఎంపీహెచ్ వరకు టాప్ స్పీడ్ ఉండొచ్చని తెలిపింది. అంతేకాకుండా మరో గుడ్ న్యూస్ ఏంటి అంటే బ్యాటరీకి ఏకంగా 8 ఏళ్ల వారెంటీని ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ సదుపాయం అన్నీ వాహనాలకు వస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ బండి డెలివరీలు ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నట్లు సంస్థ వివరించింది. బండిని రెడ్ వెలసిటి, వోగ్, లిక్విడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ ప్రకటించింది. బండి బరువు 112 కిలోలు ఉంటుందని సంస్థ వివరించింది. ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్వర్క్ను 50 శాతం విస్తరించి సుమారు 600 కేంద్రాలకు పెంచాలనే ఆలోచనలో ఉంది. 3 kW పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్ యాక్సెసరీని ప్రవేశపెట్టడం, దీని ధర రూ. 30,000, EV యజమానులకు ఛార్జింగ్ సౌలభ్యాన్ని పెంచడం లక్ష్యంగా సంస్థ పెట్టుకుంది. వారంటీని 1 లక్ష కిలోమీటర్ల వరకు పొడిగిస్తే అదనంగా రూ.4,999, 1.25 లక్షల కిలోమీటర్లకు పొడిగిస్తే రూ.13,999 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. Also read: మిత్రపక్ష నాయకుని పై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు! #electric-bike #bikes #ola మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి